హీరో పవన్ కళ్యాణ్ పై హీరోయిన్ ఊర్వశి రాతెలా వల్లమాలిన ప్రేమ చూపిస్తుంది. తాజాగా ఆమె మరో ఆసక్తికర కామెంట్ చేశారు.
లేటెస్ట్ రిలీజ్ బ్రో మూవీలో ఊర్వశి రాతెలా ఐటెం సాంగ్ చేసింది. ఈ క్రమంలో బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పై అభిమానం చూపుతూ ఓ ట్వీట్ వేసింది. ఏకంగా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ సంభోదించింది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టమంటూ కొనియాడింది. పవన్ కళ్యాణ్ ని సీఎం అనడంతో ఫ్యాన్స్ ఆకాశంలో తేలారు. ఊర్వశిపై ఒక్కసారిగా వాళ్లకు అభిమానం పెరిగింది. ఆమెను ఎలివేట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్వీట్స్ వేశారు.

యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ చేశారు. గతంలో ఆమె లెజెండ్ హీరో అరుళ్ శరవణన్ ని కూడా ఇలానే సీఎం అన్నారు. రానున్న పదేళ్లలో తమిళనాడుకు అరుళ్ సీఎం అవుతారంటూ ప్రెస్ మీట్లో ఓపెన్ గా చెప్పింది. ఆ వీడియో బయటకు తీసి... ఈమె అందరినీ ఇలానే సీఎం అంటుందని ఎద్దేవా చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ మీద ఆమెకు ప్రత్యేక అభిమానం ఉందని అర్ధమవుతుంది. తాజాగా ఊర్వశి రాతెలా ఫ్యాన్స్ తో ఆన్లైన్ ఛాట్ చేశారు. ఈ సందర్భంగా వందల ప్రశ్నలు ఆమెను ముంచెత్తాయి. వాటిలో చాలా వాటిని స్కిప్ చేసింది. పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పింది. వై ఎస్ జగన్, పవన్ కళ్యాణ్ లలో మీరు ఎవరిని ఎంచుకుంటారని అడగ్గా... తడుముకోకుండా పవన్ కళ్యాణ్ అని చెప్పింది.
ఈ సమాధానంతో మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానుల మనసులు ఊర్వశి రాతెలా గెలుచుకున్నారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. బ్రో మూవీ కోసం పవన్ కళ్యాణ్, ఊర్వశి కేవలం ఒకటి రెండు రోజులు పని చేశారు. అంతలోనే పవన్ అంటే ఊర్వశి వల్లమాలిన అభిమానం పెంచుకుంది. పవన్ వంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలను ఇలాంటి చర్యలతో బుట్టలో వేసుకోవడం వలన మేలే జరుగుతుంది. ముఖస్తుతి చేయడంలో తప్పేం లేదు. నిజానికి పరిశ్రమలో మనుగడ సాగించే చాలా మంది నటులు, సాంకేతిక నిపుణులు దీన్నే ఫాలో అవుతారు. ఈ విషయంలో ఊర్వశి రెండు ముక్కలు ఎక్కువ చదివింది.
