Asianet News TeluguAsianet News Telugu

సంజూ ముఖంపై టాటూ, డీకోడ్ చేస్తే షాకింగ్ మీనింగ్

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం‘కేజీఎఫ్’. ఈ  చిత్రం ఐదు భాషల్లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  ప్రపంచవ్యాప్తంగా రూ 200 కోట్లు రాబట్టిన తొలి కన్నడ చిత్రంగా  కేజీఎఫ్‌ రికార్డు నెలకొల్పింది. ఈ సూపర్‌ హిట్‌ మూవీ ‘కె.జి.ఎఫ్‌’కి కొనసాగింపుగా రూపొందుతున్న ‘కె.జి.ఎఫ్‌ చాప్టర్‌–2’లో సంజయ్ దత్ విలన్‌ అధీరా పాత్రను పోషిస్తున్నారు. బుధవారం సంజయ్‌ దత్‌ పుట్టినరోజు (జూలై 29) సందర్భంగా అధీరా పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర టీమ్.

I am the place of Death: Sanjay Dutt
Author
Hyderabad, First Published Aug 1, 2020, 12:49 PM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం‘కేజీఎఫ్’. ఈ  చిత్రం ఐదు భాషల్లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  ప్రపంచవ్యాప్తంగా రూ 200 కోట్లు రాబట్టిన తొలి కన్నడ చిత్రంగా  కేజీఎఫ్‌ రికార్డు నెలకొల్పింది. ఈ సూపర్‌ హిట్‌ మూవీ ‘కె.జి.ఎఫ్‌’కి కొనసాగింపుగా రూపొందుతున్న ‘కె.జి.ఎఫ్‌ చాప్టర్‌–2’లో సంజయ్ దత్ విలన్‌ అధీరా పాత్రను పోషిస్తున్నారు. బుధవారం సంజయ్‌ దత్‌ పుట్టినరోజు (జూలై 29) సందర్భంగా అధీరా పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర టీమ్.
 
తెల్లటిగడ్డం, మెలితిరిగిన మీసాలు, ముఖంపై పచ్చబొట్టు, చేతిలో కత్తితో సంజయ్‌ దత్‌ కొత్త లుక్‌లో అభిమానులను ఆనందపరిచారు. అదే సమయంలో ఆయన ముఖంపై ఉన్న టటూ అంతటా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ టటూ అర్దమేంది..ఏ భాష అనేది సోషల్ మీడియాలో అందరూ హాట్ టాపిక్ గా మాట్లాడుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ టట్టూని డీ కోడ్ చేసారు. ఆ టటూ ఉన్నది సంస్కృతంలో . 

దాని అర్దం ఇలా ఉంది. “నేనే మతృవుకు జన్మస్దలాన్ని. నా నుంచి జాలి, దయ ఎప్పుడూ ఆశించవద్దు. యుద్దం ఒకటే ఈ ప్రపంచానికి శరణ్యం”

ఇక కేజీఫ్ విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్‌ మంచి కలెక్షన్స్  సాధించింది. షారుక్‌ ఖాన్‌ జీరో, రణ్‌వీర్‌ సింగ్‌ల సింబా సినిమాలను తట్టుకుని ఈ సినిమా హిందీ వెర్షన్‌ రూ 40 కోట్లు వసూలు చేయడం బాలీవుడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. దాంతో ఈ చిత్రం సెకండ్ పార్ట్ ని మరింత పెద్దదిగా చేయటానికి గానూ బాలీవుడ్ స్టార్స్  సీన్ లోకి తీసుకు వస్తున్నారు. 

 అలాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారని బాలీవుడ్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఫరాన్ అక్తర్ ఈ విషయమై చిత్రం యూనిట్ తో చర్చలు జరిపారని, సంజయ్ దత్ ని సీన్ లోకి తేవటం ద్వారా అక్కడ మార్కెట్ కు ప్లస్ అవుతుందని, అలాగే సంజయ్ కు దక్షిణాదిలో మరో సారి చిత్రం చేసినట్లు ఉంటుందని ప్లాన్ చేస్తున్నారట.  
 
కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలనచిత్రం ద్వారా నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేస్తారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: భువన్‌ గౌడ.
 
Follow Us:
Download App:
  • android
  • ios