అక్కినేని అఖిల్ నటించిన 'హలో' చిత్రంలో తెలుగు తెరకు పరిచయమైన నటి కళ్యాణి ప్రియదర్శిని ప్రేమలో ఉన్నట్లు ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె నటించిన 'చిత్రలహరి' సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

ఈ సినిమాలో లహరి పాత్రలో కళ్యాణి చక్కగా నటించింది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకొంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా తన వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించింది.

ప్రస్తుతం తను ప్రేమలో ఉన్నట్లు, మరో మూడేళ్లలో అతడిని పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పింది. తమ ప్రేమను ఇంట్లో వాళ్లు కూడా అంగీకరించారని సంతోషంగా ప్రేమ కబుర్లను షేర్ చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కుమార్తె అయిన కల్యాణి ప్రియదర్శన్ మొదట ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేసింది.

ఆ తరువాత హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ శివకార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇవ్వబోతుంది. అలానే మలయాళంలో ఆమె ఓ చారిత్రాత్మక చిత్రలో నటిస్తోంది.