ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతున్న "హైదరాబాద్ లవ్ స్టోరీ"

ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతున్న "హైదరాబాద్ లవ్ స్టోరీ"

ఈ వారం విడుదల కానున్న సినిమాలలో ప్రేక్షకులను అలరించే సినిమాగా కనపడుతున్న మూవీ హైదరాబాద్ లవ్ స్టొరీ. టైటిల్ తోనే మ్యాజిక్ చేస్తున్న ఈ మూవీలో త్వరలో చి..ల..సౌ సినిమాతో దర్శకుడిగా మారుతున్న రాహుల్ రవీంద్రన్‌ ఆసక్తికర పాత్రలో చేస్తున్నారు. రాహుల్ రవీంద్ర, రేష్మి మీనన్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ’హైదరాబాద్‌ లవ్‌ స్టోరి’ ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్‌కు రెడీ అవుతోంది.
 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాతలు ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొడుమగుల్ల చిత్ర విశేషాలను తెలియజేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిందని సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ రవీంద్ర, రేష్మి మీనన్, జియా, రావు రమేష్, సూర్య, సన మిగతా భారి తారాగణం నటించిన ఈ సినిమాకు రాజ్ సత్య దర్శకత్వం వహించగా  సునీల్ కశ్యప్ సంగీతం ప్రధాన ఆకర్షణ గా నిలిచిందన్నారు. ఎడిటింగ్ ఏం.ఆర్ వర్మ,  కెమెరా బి.వి అమర్ నాథ్ రెడ్డి అందించారు. పెయ్యల మల్లికార్జున్ రావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

 

ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్... ఫ్యామిలీ ఆడియెన్స్  అండ్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకొని ప్రేక్షకులలో సినిమా పట్ల మంచి అంచనాలే నెలకొల్పింది. కాగా  దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ”మా సినిమాను భారి అంచనాల మధ్య  ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం, ఎల్లప్పుడూ మంచి సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా ఘన విజయం చేస్తారని బలంగా నమ్ముతున్నాం ”  అని తెలిపారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos