గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమానికి సెలబ్రిటీల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే టెలివిజన్‌ కళాకారులతో పాటు పలువురు సినీ తారలు ఈ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. తాజాగా మరో యంగ్‌ హీరో కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాడు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరోయిన్ ప్రియాంక శర్మ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కు లో మొక్కలు నాటిన హీరో దినేష్ (హుషారు) ఈ సందర్భంగా.. దినేష్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు ఈ చాలెంజ్ తో అయినా అందరూ ముందుకు వచ్చి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

మన భవిష్యత్ తరాలకు అందించేది ఈ ప్రకృతి ఒకటేనని ప్రకృతి మంచిగా ఉంటే మనందరం బాగుంటావము అని తెలిపారు. ఈ సందర్భంగా మరొక ముగ్గురు ప్లే బ్యాక్ సినిమా టీం అనన్య నాగళ్ళ; జక్క హరిప్రసాద్;  స్పందన లను మొక్కలు నాటాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.