నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్బీకే107’. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. 

ఆరుపదుల వయసులోనూ టాలీవుడ్ ను షేక్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎన్బీకే107’. `అఖండ` లాంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలయ్య హీరోగా వస్తోన్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని `క్రాక్‌` హిట్‌ తర్వాత దర్శకుడు గోపీచంద్‌ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ తో దూసుకుపోతున్న ఈ కాంబినేషనల్ లో వస్తున్న NBK107పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా మేకర్స్ అభిమానులు, ఆడియెన్స్ కు కిక్ ఇచ్చే అప్డేట్ అందించారు. 

ఎన్బీకే 107 నుంచి మాసీవ్ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు బాలయ్య 62వ పుట్టిన రోజు సందర్భంగా ఫుల్ మీల్స్ పెట్టారు మేకర్స్. ఫస్ట్ హంట్ పేరిట ఎన్బీకే107 టీజర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బాలయ్య డైలాగ్స్, ఎనర్జీ, యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో నెంబర్ #1లో ట్రెండ్ అవుతోంది. 10 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకున్న ఈ టీజర్ ఇంకా దూసుకెళ్తొంది.

గతంలో మూవీ నుంచి రిలీజ్ అయిన బాలయ్య పవర్ ఫుల్ పోస్టర్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు గోపిచంద్ మలినేని బాలయ్యను మరింత పవర్ ఫుల్ గా, మాస్ గా చూపించినట్టు టీజర్ ను చూస్తే అర్థం అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ శృతి హాసన్‌ (Shruti Haasan) నటిస్తోంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

YouTube video player