క్రేజీ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఎన్.జి.కె. సీనియర్ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూర్య సినిమాలు నిరాశపరిచినా ఆ చిత్రంలో ఏదో విషయం ఉందని ప్రేక్షకులకు కొంతవరకు సంతృప్తిని ఇస్తుంటాయి. కథల ఎంపిక విషయంలో సూర్య చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. కానీ ఎన్.జి.కె చిత్రాన్ని ఎందుకు ఓకే చేశాడా అని సూర్య అభిమానులే నిరాశని వ్యక్తం చేస్తున్నారు. 

ఏమాత్రం మెప్పించని పొలిటికల్ డ్రామాగా ఎన్.జి.కె మిగిలిపోయింది. ఇక కలక్షన్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రలో ఈ చిత్రం భారీ నష్టాలనే మిగిల్చింది. తెలుగులో థియేట్రికల్ హక్కులు దాదాపు 9 కోట్లకు అమ్ముడయ్యాయి. విడుదలై నెలరోజులు పూర్తి కావడంతో క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు బయటకు వస్తున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో ఎన్.జి.కె చిత్రం రాబట్టిన టోటల్ షేర్ 4.5 కోట్లుగా తెలుస్తోంది. అంటే 50 శాతం వరకు బయ్యర్లకు నష్టాలే. తమిళంలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య కెవి ఆనంద్ దర్శకత్వంలో కప్పాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.