హృతిక్, కంగనాల మధ్య 2016 నుంచి కేసు నడుస్తుంది. వీరిద్దరి మధ్య గతంలో లవ్ ఎఫైర్ ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కంగనా ఇదే విషయం చెప్పింది. తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని, ఆ తర్వాత విడిపోయినట్టు చెప్పింది. దీనిపై హృతిక్ స్పందించారు.
హృతిక్ రోషన్, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ల ఈ మెయిల్ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు ఐదేళ్లుగా ఇది కోర్ట్ లు, క్రైమ్ బ్రాంచ్‌ల చుట్టూ తిరుగుతుంది. తాజాగా కోర్ట్ కి హాజరు కావాలని ముంబయి క్రైమ్ ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ హృతిక్‌కి శుక్రవారం సమన్లు జారీ చేసింది. నేడు(ఫిబ్రవరి 27)న కోర్ట్ ముందు హృతిక్ స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు హృతిక్ నేడు కోర్ట్ ముందు హాజరు కానున్నారు.
హృతిక్, కంగనాల మధ్య 2016 నుంచి కేసు నడుస్తుంది. వీరిద్దరి మధ్య గతంలో లవ్ ఎఫైర్ ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కంగనా ఇదే విషయం చెప్పింది. తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని, ఆ తర్వాత విడిపోయినట్టు చెప్పింది. దీనిపై హృతిక్ స్పందించారు. కంగనా తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. కంగనాపై కేసు పెట్టాడు. ఈ క్రమంలో వీరి మధ్య ఈమెయిల్ భాగోతం బయటపడింది. కంగనా ఈ విషయాన్ని వెల్లడించింది. దీన్ని మరింత సీరియస్‌గా తీసుకున్న హృతిక్ ఈ కేసు విషయంలో ఆయన ముందుకెళ్లారు. ముంబై పోలీసుల చేతిలో నుంచి క్రైం ఇంటలిజెన్స్ యూనిట్ ఆఫ్ ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్‌కి షిఫ్ట్ చేయించారు హృతిక్.
ఇటీవల వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న కంగనా ప్రస్తుతం `తలైవి`, `దాఖడ్`తోపాటు `తేజాస్` అనే చిత్రంలో నటిస్తుంది. మరోవైపు హృతిక్ `ఫైటర్`, `క్రిష్ 4` చేస్తున్నారు.
