ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్ గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ వ్యాధి మరింత ముదరడంతో డాక్టర్ల ప్రత్యేక పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు.

బైపోలార్ డిజార్డర్‌‌ తో చాలా కాలంగా సునైనా బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. గతేడాది ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవడంతో రోషన్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

అప్పటినుండి ఆమెకి మెరుగైన చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఈ వ్యాధి కారణంగా ఆమె తీవ్ర మానసిక వేదనకి గురవుతుంటారు. ఒక్కోసారి ఉన్మాదంగా ప్రవర్తించడం కూడా జరుగుతుంటుంది.