Asianet News TeluguAsianet News Telugu

ముంబయ్ మెట్రోలో హృతిక్ రోషన్.. ప్రయాణికులతో సరదాగా కబుర్లు చెప్పిన స్టార్ హీరో..

అప్పుడప్పుడు సెలబ్రిటీలు సామాన్యల ప్రజలకు సర్ ప్రైజ్ ఇస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ముంబయ్ మెట్రోలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సందడి చేశారు. 

Hrithik Roshan In Mumbai Metro Train JMS
Author
First Published Oct 14, 2023, 4:30 PM IST

అప్పుడప్పుడు సెలబ్రిటీలు సామాన్యల ప్రజలకు సర్ ప్రైజ్ ఇస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ముంబయ్ మెట్రోలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సందడి చేశారు. 

ఈమధ్య బాలీవుడ్ సెలబ్రిటీలు పబ్లిక్ లో ఎక్కువగా సందడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ బిజీ జీవితంలో ముంబయ్ లో కారు ప్రయాణం చేయడానికి వారు ఇష్టపడటంలేదు. ఎక్కువ దూరం వెళ్లాలంటే.. కారులో ట్రాఫిక్ లో ..వెళ్లి నడుము నొప్పులు తెచ్చుకోవడం కంటే.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఎక్కుగా ఉపయోగించడానికి చూస్తున్నారు. ఈమధ్య హేమామాలిని లాంటి స్టార్లు.. ముంబయ్ మెట్రోలో సందడి చేశారు. ఇక తాజాగా మరో స్టార్ హీరో మెట్రోలో సందడి చేశారు. 

ట్రాఫిక్‌ కష్టాలు తప్పించుకునేందుకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా ముంబై మెట్రోలో ప్రయాణించారు. అంతటి నటుడు మెట్రోలో ప్రయాణిస్తారని ఊహించని ప్రయాణికులు హృతిక్‌ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనేక మంది ఆయనతో సెల్ఫీలు కూడా దిగేందుకు ఉత్సాహం చూపించారు. అభిమానులతో దిగిన ఫొటోలను హృతిక్ నెట్టింట షేర్ చేశారు.   

షూటింగ్ కోసం బయలుదేరానని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. యాక్షన్ సన్నివేశాల ముందు ట్రాఫిక్‌లో చిక్కుకుని వెన్నునొప్పి తెచ్చుకొనే బదులు ఇలా మెట్రోను ఎంచుకున్నట్టు సరదా వ్యాఖ్యలు చేశారు. మెట్రో ప్రయాణికులు తనపై ఎంతో అభిమానం కురిపించారని చెప్పుకొచ్చారు. ఇదో అద్భుతమైన అనుభవమని పేర్కొన్నారు. ఎండవేడి, ట్రాఫిక్ సమస్య ఒకేసారి తప్పిపోయాయని కామెంట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios