వార్, పఠాన్ లాంటి చిత్రాలతో యాక్షన్ మూవీస్ కి డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ కొత్త అర్థం చెబుతున్నారు. వార్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి సిద్దార్థ్, హృతిక్ కాంబోలో వస్తున్న చిత్రం ఫైటర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా ఫైటర్ అభిమానుల్లో క్రేజ్ తెచ్చుకుంది.
వార్, పఠాన్ లాంటి చిత్రాలతో యాక్షన్ మూవీస్ కి డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ కొత్త అర్థం చెబుతున్నారు. వార్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి సిద్దార్థ్, హృతిక్ కాంబోలో వస్తున్న చిత్రం ఫైటర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా ఫైటర్ అభిమానుల్లో క్రేజ్ తెచ్చుకుంది. గతంలో హృతిక్ రోషన్ లక్ష్య చిత్రంలో ఇండియన్ ఆర్మీ అధికారిగా నటించాడు.
దాదాపు 20 ఏళ్ల తర్వాత హృతిక్ ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్ గా నటిస్తున్నాడు. ఇండియాపై పాకిస్తాన్ ఉగ్రవాదులు పుల్వామా అటాక్ చేసిన సంఘటన ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతీకారం తీర్చుకున్న విధానం చరిత్రలో ఎప్పటికి గుర్తుంటుంది. ఈ నేపథ్యంలో సిద్దార్థ్ ఆనంద్ ఫైటర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ అబ్బుర పరిచే ఏరియల్ యాక్షన్ విజువల్స్ తో ఆకట్టుకుంటోంది.
దేశభక్తిని పెంచేలా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ట్రైలర్ ఉంది. ఈ చిత్రంలో హృతిక్ ఫైటర్ జెట్ పైలెట్ గా ఎయిర్ డ్రాగన్స్ అనే స్పెషల్ టీం కి లీడర్ గా వ్యవహరిస్తున్నాడు. హృతిక్ రోషన్ చెబుతున్న డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ హృతిక్ నటించినట్లు ఉన్నారు.
మరోవైపు దీపికా పదుకొనె అందాలు ఆరబోస్తూనే తాను కూడా ఎయిర్ ఫోర్స్ అధికారిగా నటించింది. ఏరియల్ యాక్షన్ లో మిసైల్స్ ఉంచి ఫైటర్ జెట్ లు తప్పించుకోవడం, శత్రువులపై అటాక్ చేయడం లాంటి దృశ్యాలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. ఇక హృతిక్ రోషన్ ట్రైలర్ చివర్లో చెప్పిన డైలాగ్ అయితే కేకపెట్టించే విధంగా ఉంది.

పీవోకే అంటే అర్థం పాకిస్తాన్ అక్కుపైడ్ కశ్మీర్.. కానీ దానికి అసలైన యజమానులం మేమే. మీ లాంటి టెర్రరిస్టులు నా సహనానికి పరీక్ష పెడుతుంటే ఒక రోజున పాకిస్తాన్ లోని ప్రతి అంగుళం మా సొంతం అవుతుంది.. అంటే ఇండియా అక్కుపైడ్ పాకిస్తాన్ IOP అంటూ హృతిక్ చెబుతున్న డైలాగ్ కేక పెట్టించే విధంగా ఉంది. రిపబ్లిక్ డేకి ఒకరోజు ముందు అంటే జనవరి 25న ఫైటర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
