సింగర్ తో తన రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చాడు బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్. చాలా కాలంగా మీడియాలో.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై క్రియర్ కట్ గా చెప్పేశాడు. ఇంతకీ రిలేషన్ పై ఆయన ఏమన్నాడు.  

చాలా కాలంగా బాలీవుడ్ కండల వీరడు హృతి రోషన్- సింగర్ సబా ఆజాత్ పై రకరకాల న్యస్ లు హల్ చల్ చేస్తున్నాయి. వీళ్లిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని. కలిసి తిరుగుతన్నారని.. అన్ని పనులు అయిపోయాయని ఇలా.. రకరకాల వార్తలు హల్ చల్ చేశాయి. వీళ్లు కూడా బాగా క్లోజ్ గా ఉంటూ.. మీడియాకు దొరికిపోతూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో ఆయన వర్షన్ క్లియర్ గా చెప్పేశారు హృతిక్. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్ సింగర్‌ సబా ఆజాద్‌ తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడంటూ రకరకాల వార్తలు నెట్టింట్ల చక్కర్లు కొడుతున్నాయి. వీటికి ఊతం ఇస్తూ.. ఈ ఇద్దరు తారలు ముంబైలో జరిగే సినిమా వేడుకలు, పార్టీల్లో కలిసి కెమెరా కంట పడ్డారు. అంతే కాదు తాజాగా హృతిక్‌ రోషన్‌ తన ప్రియురాలి కోసం ఏకంగా వందకోట్లతో ముంబైలో లగ్జరీ ప్లాట్ కూడా కొన్నాడంటూ వార్తలు హల్ చల్ చేశాయి. త్వరలో ఈ ఇద్దరు సహజీవనం చేయడం కోసం ఈ అపార్ట్‌మెంట్‌ ప్లాట్ లోకి మారుతుననారంటూ వార్తలు వినిపించాయి. 

ఇక ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు కండల వీరుడు. అలాంటిదేమి లేదంటూ.. నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలపై మండిపడ్డాడు. ఈ వార్తల్లో వాస్తవం లేదు.. ఓ సెలబ్రిటీగా నాకు సంబంధించిన అంశాల పట్ల క్యూరియాసిటీ ఉండటం చాలా కామన్.. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకుంటా. కానీ అవి హెల్దీగా ఉండాలి.. ఇలా తప్పుడు సమాచారాన్ని స్పెర్డ్ చేయకూడదు.. అందుకే ఇలాంటి న్యూస్ కు నేను దూరంగా ఉండటం ఉత్తమం. ప్రత్యేకించి బాధ్యత గల మన రిపోర్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా.. అంటూ ట్వీట్ చేశాడు.

Scroll to load tweet…

హృతిక్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ ఫైటర్‌ సినిమాలో నటిస్తున్నాడు. 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ కు రెడీ అవుతుంది మూవీ. ఇప్పుడు అస్సోంల్ లో రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటుంది సినిమా.
.