Asianet News TeluguAsianet News Telugu

యుద్ధ విమానాలతో అబ్బురపరిచే యాక్షన్, హృతిక్ 'ఫైటర్' టీజర్ వచ్చేసింది..దీపికా బౌండరీలు బ్రేక్ చేసేసిందిగా

వార్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి సిద్దార్థ్, హృతిక్ కాంబోలో వస్తున్న చిత్రం ఫైటర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తొలిసారి తెరకెక్కుతున్న ఇండియన్ మూవీ ఇదే. 

Hrithik Roshan and Deepika Padukone Fighter movie teaser out now dtr
Author
First Published Dec 8, 2023, 5:15 PM IST

వార్, పఠాన్ లాంటి చిత్రాలతో యాక్షన్ మూవీస్ కి డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ కొత్త అర్థం చెబుతున్నారు. వార్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి సిద్దార్థ్, హృతిక్ కాంబోలో వస్తున్న చిత్రం ఫైటర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తొలిసారి తెరకెక్కుతున్న ఇండియన్ మూవీ ఇదే. 

ఈ మూవీలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా, దీపికా పదుకొనె ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా టీజర్ విడుదలై సోషల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీజర్ చూస్తుంటే అబ్బురపరిచే యాక్షన్ విన్యాసాలకు ఆకాశమే హద్దు అనిపిస్తోంది. 

యుద్ధ విమానాలతో సిద్దార్థ్ ఆనంద్ చేయిస్తున్న యాక్షన్ ఘట్టాలు సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించేలా కనిపిస్తున్నాయి. టీజర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పించే షాట్స్ తో కొనసాగుతోంది. టీజర్ లో జెట్ ఫ్లైట్ విన్యాసాలు హాలీవుడ్ చిత్రాల్ని తలపించేలా ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది విడుదలైన టామ్ క్రూజ్ టాప్ గన్ మెవరిక్ చిత్రం గుర్తుకు వస్తోంది. 

దీపికా పదుకొనె, హృతిక్ రోషన్ ఇద్దరూ యమా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తాని ప్రతిభింబించేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్ లో దీపికా గ్లామర్ ట్రీట్ కూడా మిస్ కాలేదు. ఒక షాట్ లో దీపికా బికినిలో కనిపిస్తూ హృతిక్ కి లిప్ కిస్ ఇస్తున్న దృశ్యం బౌండరీలు బ్రేక్ చేసేలా ఉంది. దీపికా పిక్ ని నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పఠాన్ చిత్రంలో కూడా సిద్దార్థ్ ఆనంద్ దీపికాని బోల్డ్ గా చూపించారు. 

Hrithik Roshan and Deepika Padukone Fighter movie teaser out now dtr

వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విశాల్ శేఖర్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జనవరి 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. 

Hrithik Roshan and Deepika Padukone Fighter movie teaser out now dtr

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios