కొన్ని రోజుల కిందట బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చికిత్స తర్వాత కరోనా నుంచి కోలుకున్న స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్  ఇంటికి ఆరోగ్యంగా వెళ్లారు. తమ కుటుంబం కరోనా నుంచి కోలుకోవాలంటూ అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు చూపిన ప్రేమ పట్ల ఐశ్వర్యరాయ్ ధన్యవాదాలు కూడా తెలిపింది. ఈ నేపధ్యంలో అసలు ఈ కుటుంబానికి కరోనా ఎలా స్ప్రెడ్ అయ్యిందనే విషయమై మీడియాలో చర్చ జరుగుతోంది. ఎవరి ఊహాగానాలు వాళ్లు చేస్తున్నారు. ఇన్నాళ్లూ అమితాబ్ ఓ టీవి షో కోసం వెళ్లటంతో ఈ సమస్య మొదలైందని వార్తలు వచ్చాయి. అయితే ముంబైకు చెందిన ఓ పెద్ద మీడియా సంస్ద తాజాగా మరో ఊహాగానం చేసింది. 

అభిషేక్ బచ్చన్ ద్వారానే కరోనా ఆ ఇంట్లో ప్రవేసించిందంటూ రాసుకొచ్చింది. ఆయన తన తాజా వెబ్ సీరిస్ బ్రీత్ కు డబ్బింగ్ చెప్తున్నారు. ఓ ప్రెవేట్ డబ్బింగ్ స్టూడియోలో ఈ డబ్బింగ్ జరుగుతోంది. అక్కడ నుంచి ఆయనకు సోకిందని, తర్వాత ఇంట్లో వాళ్లకు వచ్చిందని అన్నారు. 
 
 తాజా కోవిడ్19 టెస్టుల్లో నెగటివ్ రావడంతో ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలను సోమవారం (జులై 27న) డాక్టర్లు డిశ్ఛార్జ్ చేయగా  తమ నివాసానికి (Jalsa) తిరిగొచ్చారు. కాగా, అమితాబ్, అభిషేక్ ఇంకా నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జులై 11నుంచి వీరు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి నివాసం కంటైన్‌మెంట్ జోన్‌గా ముంబై అధికారులు కొనసాగిస్తున్నారు.