చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.   

ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. చరణ్ మాట్లాడుతూ.. 
నాన్న(చిరంజీవి)తో కలిసి ఆచార్య(Acharya)లో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం కోసం ఎంతో శ్రమించిన టెక్నీషియన్స్, యాక్టర్స్ కు, చిత్ర యూనిట్ కు ప్రత్యేక ధన్యవాదాలు. దర్శకుడు కొరటాల శివతో కలిసి ఎప్పటి నుంచో యూవీ క్రియేషన్స్ లో కలిసి సినిమా చేయాలని అనుకున్నాం. ఇన్నాళ్లు కుదరలేదు. ఇన్నాళ్లు ఎదురుచూశాను. 

కానీ కాస్తా ఆలస్యమైనా ఇవ్వాళ నాన్నతో కలిసి శివ డైరెక్షన్ లో నటించడం చాలా ఆనందంగా ఉంది. కొరటాల శివ సినిమాల్లో క్యారెక్టరైజేషన్ లో బలం ఉంటుందని తెలుసుకున్నాను. నేను నటించిన చిత్రాల్లో ధ్రువ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ (RRR) నాకు బాగా నచ్చిన సినిమాలు.. ఎందుకంటే నేను చాలా ఇష్టంగా ఈ సినిమాలకు పనిచేశాను. అందుకు తగిన విధంగానే ఊహించని విధంగా రిజల్ట్స్ వచ్చాయి. ఇష్టపడి పనిచేస్తే ఇంత ఫలితం ఉంటుందా అని తెలుసుకున్నాను. 

నేను జీవితంలో డబ్బులు సంపాదించాలంటే సినిమాలకంటే బిజినెస్ లకు వెళ్లితే ఎక్కువే సంపాదించే వాణ్ణి. కానీ నాన్నగారితో పనిచేయడం, మరియు గ్రేట్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేసే అవకాశం దక్కదు. అదో గొప్ప అనుభవం. అందుకే నేను సినిమాను వీడి వెళ్లలేను. ముఖ్యంగా నాన్న నా జీవితంలో ఆచార్య పాత్రను పోషించారు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా ఉండాలని నేర్పించారు. ప్రతి విషయాన్ని ఇంకా నేర్పిస్తూనే వస్తున్నారు. ఆయన కోపంలో తిట్టినా స్వీట్ గా నే ఉంటుంది. 

ముఖ్యంగా నాన్నతో ‘ఆచార్య’లో కలిసి నటించిన 20 రోజుల షూటింగ్ సమయాన్ని నా జీవితంలో మర్చిపోలేను. ఆ క్షణాలు అద్భుతమైనవి, స్ఫూర్తిదాయకం. ఉదయం నుంచి సాయంత్రం వరకు.. 20 రోజుల పాటు నాన్నతో కలిసి సమయం గడపటం ఓ గొప్ప అనుభూతిని కలిగించింది. ఆయన ఎంత గొప్ప వ్యక్తో నా 20 ఏండ్ల జీవితంలో తెలుసుకోలేని విషయాలను ఈ 20 రోజుల్లో తెలుసుకున్నాను. ఏదేమైనా ఆయనతో కలిసి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మళ్లీ నాన్నతో కలిసి సినిమా చేసే అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నానని అన్నారు.

అలాగే, టాలెంటెడ్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde)తో రంగస్థలంలో ఒక సాంగ్ లోనే కలిసి నటించాం. మళ్లీ తనతో ‘ఆచార్య’లో కలిసి నటించడం సంతోషంగా ఉంది. తన అద్భుత నటనకు అభినందనలు అంటూ తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైనర్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.