Asianet News TeluguAsianet News Telugu

బెల్లంకొండకు వరస ఆఫర్స్ వెనక సీక్రెట్, వింటే షాక్!

సినిమావాళ్ల మాట ఎలా ఉన్న రెగ్యులర్ గా సినిమా వార్తలు ఫాలో అయ్యేవాళ్లకు   ఓ పెద్ద డౌట్. అదేంటంటే కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక్క హిట్టూ లేని  బెల్లంకొండ శ్రీనివాస్ వరస సినిమాల్లో ఎలా బుక్ అవుతున్నారు. 

How Bellamkonda Srinivas getting chances
Author
Hyderabad, First Published Feb 13, 2019, 12:07 PM IST

సినిమావాళ్ల మాట ఎలా ఉన్న రెగ్యులర్ గా సినిమా వార్తలు ఫాలో అయ్యేవాళ్లకు   ఓ పెద్ద డౌట్. అదేంటంటే కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక్క హిట్టూ లేని  బెల్లంకొండ శ్రీనివాస్ వరస సినిమాల్లో ఎలా బుక్ అవుతున్నారు. వాళ్ల తండ్రి పెద్ద నిర్మాత కాబట్టి ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారా...ఆయనే ఫైనాన్స్ చేస్తున్నారా అని. అయితే ఎన్ని సినిమాలకు అని డబ్బులు పెట్టగలరు. ఏదో ప్రారంభంలో ఒకటి రెండు సినిమాలు అంటే ప్రొడ్యూస్ చేలగలడు కానీ. మరీ ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండి ఉండి...భారీ బడ్జెట్ లతో రూపొందుతూంటాయి. అయితే ఈ సీక్రెట్ ఏమిటనేది బయిటకు వచ్చింది.

అదేంటంటే బెల్లంకొండ సురేష్ తన సుదీర్ఘమైన సిని నిర్మాతగా అనుభవంతో తన కొడుకు కెరీర్ ని మొదట నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చిన విధానమే కలిసొచ్చింది. అందులో మొదటిది...యాక్షన్ సినిమాలు..నోటెడ్ డైరక్టర్స్, స్టార్ హీరోయిన్స్, మసాలా ఐటం సాంగ్స్. ఇవి బి,సిల్లోకి వెళ్లి మాస్ హీరోగా బెల్లంకొండ ని నిలబెడతాయని అంతా భావించారు. అయితే చిత్రంగా అదైతే జరగలేదు కానీ హిందీ శాటిలైట్ మార్కెట్ లో మాత్రం ఓ స్టార్ హీరోగా నిలబడ్డారు. 

ఆయన సినిమాలకు ఈ రోజు పది నుంచి పన్నెండు కోట్లు బిజినెస్ హిందీ మార్కెట్ లో జరుగుతోంది. దాంతో నిర్మాతలకు అక్కడే సగం రికవరీ అయిపోతోంది. అలాగే సినిమా కు మధ్యలో ఎక్కడైనా సమస్యలు వస్తే తండ్రి బెల్లంకొండ సాయిపడతారు. ఒడ్డున పడేస్తారనే నమ్మకం. ఇవన్నీ కలిసొచ్చి నిర్మాతలు లోటు లేకుండా ముందుకు వెళ్తున్నారు.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్...రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అదొక లవ్ స్టోరి. అలాగే తేజ దర్శకత్వంలో సీత టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. అవి రెండూ కాక..ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమాని సైతం కమిటయ్యాడు. అలా కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నాడన్నమాట. త్వరలోనే బెల్లంకొండకు ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ వచ్చే అవకాసం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios