హాలీవుడ్ లో ఆస్కార్ మంటలు ఇంకా చల్లారలేదు. విల్ స్మిత్ సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ దాని తాలూకు ప్రభావం కనిపిస్తూనే ఉంది. చివరకు అది క్షమాపణల వరకూ వచ్చింది. ఇంతకీ ఎవరు ఎవరికి క్షమాపణలు చెప్పారు.
ఆ మధ్య 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలను ఘనంగా నిర్వహించింది హాలీవుడ్, ప్రపంచ వ్యాప్తంగా సినీతారలతో వేడుక ఎంతో అట్టహాసంగాజరింది. అయితే ఈ కార్యక్రమంలో హోస్ట్ గా వ్యవహరించిన క్రిస్ రాక్ తన భార్య ఆరోగ్యం గురించి మాట్లాడినందకు చెంప ఛెళ్లు మనిపించాడు హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్. అప్పుడు ఆ సంఘటన సంచలనంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.
అయితే ఆ ఘటనకు సంబంధించి ఇప్పటికీ ఏదో ఒక రకంగా డొంక కదులుతూనే ఉంది. నివురు కప్పిన నిప్పులా ఈ వివాదం రేగుతూనే ఉంది. అప్పట్లోనే ఆస్కార్ అకాడమీకి, ఆస్కార్ నామినీలకు విల్ స్మిత్ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో క్రిస్ రాక్ కు క్షమాపణ చెపుతూ ఒక పోస్ట్ కూడా పెట్టాడు. అయితే అంత చెప్పినా.. విల్ స్మిత్ పైన హాలీవుడ్ నుంచి వేటు పడింది. ఇక ఈ విషయం మరో సారి చర్చకు రావడంతో తాజాగా ఆయన మరోసారి బహిరంగంగా క్షమాపణ చెప్పారు.
ఈ మధ్య విల్ స్మిత్ కు ఓ ప్రశ్న ఎదురయ్యింది. క్రిస్ రాక్ చెంప పగులగొట్టిన ఘటనపై ఇంత వరకు బహిరంగంగా ఎందుకు క్షమాపణ అడగలేదనే ప్రశ్న విల్ స్మిత్ కు ఎదురైంది. దీనిపై స్పందించిన విల్ స్మిత్... ఆ ఘటన జరిగిన తర్వాత క్రిస్ రాక్ తో మాట్లాడేందుకు తాను ప్రయత్నించానని... కానీ, తనతో మాట్లాడేందుకు ఆయన ఇంకా సుముఖత వ్యక్తం చేయలేదని చెప్పారు.
ఈ విషయాన్ని విల్ స్మిత్ ఓ వీడియోలో వివరించాడు. అంతే కాదు ఈ విధంగా విల్ స్మిత్ వీడియోలో మాట్టాడారు. క్రిస్ రాక్.. ఇప్పుడు అందరి ముందు నీకు క్షమాపణలు చెపుతున్నా...ఇది నీకు చాలదనే విషయం తనకు తెలుసని... నీవు ఎక్కడంటే అక్కడ నీతో మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నీ ఒక్కడికే కాకుండా నీ కుటుంబానికి, ఆస్కార్ కమిటీకి, ఆస్కార్ నామినీలకు, తన వల్ల ఇబ్బంది పడ్డ తన కుటుంబానికి కూడా క్షమాపణలు చెపుతున్నానని అన్నారు.
అయితే ఈ విషయంలో విల్ స్మిత్ కు కొంత మంది మద్దతుగా నిలుస్తుంటే.. మరికొంత మంది మాత్రం విల్ స్మిత్ ను వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ విషయాన్ని ఇంత దూరం లాగాల్సి అవసరం ఏముంది అన్న అభిప్రాయాలు వ్యాక్తం అవుతున్నాయి. విల్ స్మిత్ భార్య ఆరోగ్యానికి సంబంధించిన క్రిస్ రాక్ మాట్లాడకుండా ఉండాల్సింది అనే అంటున్నారు హలీవుడ్ ప్రముఖులు. ఇండియన్ స్టార్స్ కూడా కొంత మంది విల్ స్మిత్ కు సపోర్ట్ గా పోస్ట్ లు పెట్టారు.
