William Friedkin Death : ‘ఆస్కార్’ గ్రహీత.. స్టార్ డైరెక్టర్ కన్నుమూత.. హాలీవుడ్ లో ఆయనది చరిత్ర
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత విలియం ఫ్రిడ్ కిన్ తాజాగా కన్నుమూశారు. హారర్, థ్రిల్లర్ చిత్రాలకు ప్రసిద్ధిగాంచిన ఆయన హాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
‘ది ఫ్రెంచ్ కనెక్షన్’ మరియు ‘ది ఎక్సార్సిస్ట్’ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దిగ్గజ దర్శకుడు విలియం ఫ్రిడ్ కిన్ (William Friedkin) తాజాగా మృతి చెందారు. సోమవారం చిత్ర పరిశ్రమ ఆయనకు వీడ్కోలు పలికింది. 87 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. సినిమా రంగానికి ఆయన అందించిన వినూత్న సేవలు, పరిశోధించడంలో అతని నేర్పు, క్యారెక్టరైజేషన్ లో ఆయన చూపించిన పాత్రలు హాలీవుడ్ చరిత్రలో చెరగని ముద్ర వేశాయి.
మార్గదర్శక చిత్రనిర్మాతగా విలియం ఫ్రిడ్ కిన్ హాలీవుడ్ లో తనదైన ముద్రవేశారు. ఆయన అందించిన చిత్రాల్లో ‘ది ఫ్రెంచ్ కనెక్షన్’, ‘ది ఎక్సార్సిస్ట్’కు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. 60వ దశకం ప్రారంభంలో గ్లోబల్ హెరాయిన్ ట్రాఫికింగ్ సిండికేట్‌ను నిర్వీర్యం చేసిన NYPD ఆఫీసర్లు, సోనీ గ్రాసో, ఎడ్డీ ఎగాన్ దోపిడీల ఆధారంగా ‘ది ఫ్రెంచ్ కనెక్షన్’ను క్రైమ్ డ్రామా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
విలియమ్ డేవిడ్ ఫ్రిడ్ కిన్ ఆగస్టు 29 1935లో జన్మించారు. మరో 20 రోజులు గడిస్తే ఆయన పుట్టిన రోజు ఉందనగా తుదిశ్వాస విడిచారు. అమెరికన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, స్క్రీన్ రైటర్ గా ఎంతో ఘనత సాధించారు. 1970లో ‘న్యూ హాలీవుడ్’ మూవ్ మెంట్ లో విలియన్ ఫ్రిడ్ కిన్ కీలక పాత్ర పోషించారు. ఈ మూమెంట్ నాటికి ఆయన కెరీర్ ప్రారంభమై పదేళ్లు గడించింది. డాక్యుమెంటరీలు తీసే స్థఆయి నుంచి ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టే సినిమాలు తెరకెక్కించిన ఘనత ఆయనది.
ఆయన 90లోనే నలుగురి పెళ్లిచేసుకున్నారు. ముగ్గురితో విడాకులు కూడా అయ్యాయి. 1991లో పెళ్లి చేసుకున్న శేరీ లాంసింగ్ తో కలిసి ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన దర్శకుడిగా 2011వరకు వరుస చిత్రాలు చేశారు. ఇక ఈ ఏడాది ‘ది కెయిన్ ముటినీ కోర్టు - మార్షల్’ చిత్రానికి పన్నేండేళ్ల తర్వాత దర్శకత్వం వహించారు. 20203లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.