Priyanka Chopra: దివాళిరోజు భయపెట్టిన ప్రియాంక చోప్రా, దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు,
సోషల్ మీడియా జనాలను భయపెడుతోంది బాలీవుడ్ కమ్ హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. తాజాగా ఆమెను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు.

ఈ దీవాళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రజలు. సామాన్య జనాలతో పాటు.. సెలబ్రెటీలు, మరీ ముఖ్యంగా.. సినీ తారలైతే చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకో సెలబ్రెటీ దివాళీ పార్టీలు ఇస్తూ.. సందడి చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లకు పోటీగా.. హాలీవుడ్ లో కూడా.. దివాళీ పార్టీలు గనంగా జరిగాయి.. ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న గ్లోబల్ స్టార్, బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా సైతం దీపావళిని అత్తారింట్లో ఘనంగా జరుపుకుంది.
అందరు సెలబ్రిటీల మాదిరిగా అంతకంటే ఎక్కువా భర్త నిక్ జొనాస్ తో కలిసి లాస్ ఏంజిల్స్‌లో స్నేహితులు, బంధువులకు గత రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చింది ప్రియాంక చోప్రా. లాస్ ఏంజిల్స్‌లో దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ దంపతులు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఎంతో గ్రాండ్‌గా ఈ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ వేడుకల్లో ప్రియాంక వెల్వెట్ మెరూన్ బ్లౌజ్‌తో పాటు డ్యూయల్ టోన్ లెహంగా వేసుకుని .. తలలో గులాబీలతో ఆకట్టుకుంది. గోల్డ్ మెరూన్ కలర్ లిప్ స్టిక్ వేసుకున్నారు. బిందీ, సింధూర్ కూడా పెట్టుకుంది బ్యూటీ.. దానికి తగ్గట్టుగా డైమండ్ నెక్లెస్ వేసుకుని సరికొత్త అవతారంలో కనిపించింది ప్రియాంక. అటు నిక్ కూడా వైట్ కుర్తా, పూవుల ప్రింట్ తో ఉన్న కోట్ ను వేసుకున్నాడు.
డ్రెస్, జ్యూవెల్లరీ పరంగా అంతా బాగున్నా.. మేకప్ విషయంలో ప్రియాంక విచిత్రంగా కనిపిస్తోంది. తిక్ మేకప్ తో.. చిత్రంగా ఉన్న ఆమె లుక్ నెటిజన్లకు కూడా నచ్చలేదు. వామ్మే ఇదేం మేకప్.. మీ మేకప్ చలా భయంకరంగా ఉంది మేడం అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ‘ఆమె మేకప్ ఆర్టిస్ చేసిన తప్పేమిటి..? ఓమైగాడ్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘సిస్టర్.. ఇప్పుడు భారత్‌లో ఎవరూ ఇలాంటి మేకప్ వేసుకోవట్లేదు’ అంటూ ట్రల్ చేస్తున్నారు జనాలు.