Asianet News TeluguAsianet News Telugu

భర్తతో విడిపోయిన ఐదేళ్లకు తల్లైన నటి.. ఎవరితో పిల్లల్ని కంటే మీకేంటి అంటూ...

ఐదేళ్ల క్రితం పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫేమ్ జానీ డెఫ్ తో విడాకులు తీసుకున్న అంబర్ ఇప్పుడు తల్లి కావడం ఏమిటని అందరూ షాక్ అయ్యారు. 

hollywood actress announces she got a baby and netizens starts trolling ksr
Author
Hyderabad, First Published Jul 3, 2021, 1:53 PM IST


సింగిల్ స్టేటస్ అనుభవిస్తున్న హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ నేను తల్లిని అయ్యానంటూ బిడ్డను పరిచయం చేసింది. ఐదేళ్ల క్రితం పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫేమ్ జానీ డెఫ్ తో విడాకులు తీసుకున్న అంబర్ ఇప్పుడు తల్లి కావడం ఏమిటని అందరూ షాక్ అయ్యారు. ఇక విషయం తెలిసిందే తడవుగా.. ఓ వ్యక్తితో విడాకులు తీసుకొని విడిపోయిన ఐదేళ్లకు తల్లి అయ్యావా? సింగిల్ గా ఉంటున్న నీవు తల్లి ఎలా అయ్యావు? ఎవరితో కాపురం చేసి పిల్లల్ని కన్నావు? అంటూ నెటిజెన్స్ ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. 


నెటిజెన్స్ కామెంట్స్ చూసి అంబర్ కి చిర్రెత్తుకు వచ్చినట్లుంది. తనదైన శైలిలో సమాధానం చెప్పింది. నాలుగేళ్ళ క్రితమే ఓ బిడ్డకు తల్లిని కావాలి అనుకున్నా, ఇప్పుడు నా కల నెరవేరింది. పిల్లలు కనడం అనేది నా వ్యక్తిగత విషయం. నేను ఎవరితో పిల్లల్ని కంటే మీకేంటి, దాని వలన మీకు వచ్చిన నష్టం ఏమిటి, సరోగసి పద్దతి మీకు అర్థం కాని విషయం, అర్థం చేసుకున్న వాళ్ళైతే ఇలా మాట్లాడరు.. అంటూ ఫైర్ అయ్యారు అంబర్. 


తన సోషల్ మీడియా సందేశంలో తాను బిడ్డకు తల్లి ఎలా అయ్యారో పూర్తిగా వివరణ ఇచ్చినప్పటికీ, నెటిజెన్స్ సరిగా చదవకుండా ఆమెను అపార్ధం చేసుకున్నారు. చివరికి ఇలా ఆమెతో ఇలా చివాట్లు తిన్నారు. ఇక గతంలో చాలా మంది స్టార్స్ సరోగసి పద్దతి ద్వారా బిడ్డలను పొందారు. 2015లో జానీ డెఫ్ ని వివాహం చేసుకున్న అంబర్ 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. తరువాత బిజినెస్ మాన్, స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ తో ఆమె డేటింగ్ చేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amber Heard (@amberheard)

Follow Us:
Download App:
  • android
  • ios