Asianet News TeluguAsianet News Telugu

Hit Remake Release: హిట్ హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫైనల్ అంటున్న హీరోయిన్

వరుసగా తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతూ వస్తున్నాయి. కరోనా కారణంగా డిలే అవుతూ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా జెర్సీ హిందీ రీమేక్ మూవీ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.నెక్ట్స్ హిట్ హిందీ రీమేక్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది . డేట్ కూడా ఇచ్చేశారు మరి. 

Hit Remake Release Date Fixed
Author
Hyderabad, First Published May 13, 2022, 6:33 PM IST

వరుసగా తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతూ వస్తున్నాయి. కరోనా కారణంగా డిలే అవుతూ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా జెర్సీ హిందీ రీమేక్ మూవీ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.నెక్ట్స్ హిట్ హిందీ రీమేక్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది . డేట్ కూడా ఇచ్చేశారు మరి. 

ఈ మ‌ధ్య‌కాలంలో తెలుగు సినిమాలకు ఇండియావైడ్‌గా క్రేజ్ పెరిగిపోతూనే ఉంది. ఈ విషయం  ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎంత‌లా అంటే ఇండియ‌న్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని చెప్పుకునే బాలీవుడ్  సైతం తెలుగు సినిమాల మీద ఆధారపడిపోతోంది. టాలీవుడ్ నుంచి సినిమాలు  హిందీలో రీమేక్ చేస్తోంది. ఈ జాబితాలో ప్రస్తుతం ఉన్న తెలుగు సినిమా హిట్‌..ది ఫ‌స్ట్ కేస్‌.

నేచురల్ స్టార్ నాని నిర్మించి,  శైలేష్ కొల‌ను డైరెక్ష‌న్‌లో విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన ఈ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. హిందీ మేకర్స్ ను బాగా ఆకర్శించంది. దాంతో ఈ సినిమా కథను తీసుకుని అక్కడ రీమేక్ చేసేశారు. 

 

ఇక ఇదే సినిమాను రాజ్ కుమార్ రావు హీరోగా, దంగ‌ల్ ఫేం స‌న్యా మ‌ల్హోత్రా హీరోయిన్ గా  హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా  మే 20న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ముందుగా  ప్లాన్ చేశారు. కాని తాజాగా ఈ సినిమా రిలీజ్ ను మ‌రో తేదీకి మారుస్తూ రిలీజ్ డేట్‌ను ఫైన‌ల్ చేసింది టీం. జులై 15న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ హిట్ ను జులై 15న మీ ముందుకు తీసుకొస్తున్నామ‌ని, లొకేష‌న్‌లో టీం మెంబ‌ర్స్ తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది హీరోయిన్  స‌న్యా మ‌ల్హోత్రా. టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు హిందీలో  వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భూష‌ణ్ కుమార్‌, క్రిష‌న్‌కుమార్‌, కుల్‌దీప్ రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాన‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios