సినీ నటుడు కార్తికేయ హీరోగా నటించిన తాజాగా చిత్రం 'హిప్పీ'. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

''ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే.. ప్యారడైజ్ బిగిన్స్.. అదే అమ్మాయి మనల్ని తిరిగి లవ్ చేయడం స్టార్ట్ చేస్తే.. మై ప్యారడైజ్ లాస్ట్'' అంటూ కార్తికేయ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.

ఇందులో ఇద్దరు అమ్మాయిలను లవ్ చేస్తూ వారిద్దరి మధ్య నలిగిపోతుంటాడు హీరో. 'అమ్మాయిలను చందమామతో ఎందుకు పోలుస్తారో తెలుసా..? వాళ్లు ఒక్కొక్క దినం ఒక్కో మాదిరి ఉంటరు' అని జెడి చక్రవర్తి చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.