హీరోయిన్ అమలాపాల్ కొద్దిరోజుల క్రితం భవ్నిందర్ సింగ్ పై పరువునష్టం దావా వేశారు. తన ప్రమేయం లేకుండా ఇద్దరూ కలిసి దిగిన ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి, తన పరువుకు భంగం కలిగించారని పిటీషన్ వేశారు. వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో కానీ, మరే ఇతర మాధ్యమాలలో షేర్ చేయకుండా ఆదేశించాలని కోరడం జరిగింది. అమలా పాల్ పిటీషన్ పరిశీలించిన మద్రాస్ హై కోర్ట్ ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. 

  భవ్నిందర్ సింగ్  అమలాపాల్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడానికి వీలు లేదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసును డిసెంబర్ 22కి వాయిదా వేస్తూ, భవ్నిందర్ సింగ్ ని వివరణ కోరడం జరిగింది. కొద్దిరోజుల క్రితం అమలా పాల్-భవ్నిందర్ సింగ్  సాంప్రదాయ పెళ్లి దుస్తులలో సన్నిహితంగా ఫోటోలు దిగారు. 

ఆ ఫోటోలు వైరల్ కావడంతో పాటు అమలా పాల్ రెండవ వివాహం చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఆ వార్తలను అమలా పాల్ ఖండించారు. కేవలం వృత్తి పరంగా ఆ ఫోటోలు దిగడం జరిగిందని, మేమిద్దరం పెళ్లి చేసుకోలేదని వివరణ ఇచ్చారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకొని భవ్నిందర్ సింగ్ తనను పెళ్లి చేసుకున్నట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారని, ఆమె కేసు పెట్టడం జరిగింది. 

2014లో దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న అమలా పాల్..2017లో అతనికి విడాకులు ఇవ్వడం జరిగింది.  కాగా గత ఏడాది అమలాపాల్ ఆడై అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేశారు. తెలుగులో ఈ చిత్రం ఆమె పేరుతో విడుదలైంది. ఆ చిత్రంలో అమలాపాల్ నగ్నంగా నటించి సంచలనానికి తెరలేపింది.