నాని హీరోగా, మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా కూతురు సెంటిమెంట్‌తో `హాయ్‌ నాన్న` మూవీ రూపొందుతుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఎమోషనల్‌ గా సాగుతూ ఆకట్టుకుంటుంది.

నేచురల్‌ స్టార్‌ నాని `దసరా` వంటి మాస్‌ మూవీ తర్వాత మళ్లీ తన క్లాస్‌ జోనర్‌కి షిఫ్ట్ అయ్యాడు. ఆయన ప్రస్తుతం `హాయ్‌ నాన్న` చిత్రంలో నటించారు. శౌర్యవ్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. శృతి హాసన్‌ కీలక పాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. శుక్రవారం సాయంత్రం `హాయ్‌ నాన్న` ట్రైలర్‌ని విడుదల చేశారు. 

తాజాగా ట్రైలర్‌ ఆద్యంతం ఎమోషనల్‌ జర్నీలా సాగింది. కూతురు సెంటిమెంట్‌తో సాగడం విశేషం. ట్రైలర్‌లో నాని తన కూతురుకి స్టోరీస్‌ చెబుతుంటాడు. ఆ కథలకు తగ్గట్టుగా కూతురు రియల్‌ లైఫ్‌లో తమ పాత్రలను ఊహించుకుంటుంది. ఇలా ఆమెకి తల్లి లేని లోటుని తీర్చే ప్రయత్నం చేస్తుంటాడు నాని. అయితే నాని ఎక్కువగా నాన్న కథే చెబుతుంటారు, అమ్మ కథలు చెప్పవా అంటూ నిలదీస్తుంది. దీంతో అమ్మ పాత్రతో కథలు చెబుతుంటాడు. అయితే కథలో అమ్మ పాత్ర గురించి చెప్పాల్సి వస్తే అప్పుడే పరిచయం అయిన మృణాల్‌ని ఊహించుకుంటుంది. 

దీంతో తన కూతురికి మృణాల్‌ దగ్గరవుతుంది. అది తన మొదటి ప్రియురాలు(శృతి హాసన్‌)ని గుర్తు చేస్తుంది. దీంతో ఎమోషనల్‌ అవుతాడు నాని. శృతి లాగానే మృణాల్‌తోనూ ప్రేమలో పడతాడు. అయితే మొదట శృతి హాసన్‌ తనని వదిలేసి పోతుంది. ఇప్పుడు మృణాల్‌ కూడా కష్ట సమయంలో వదిలేస్తుంది. దీంతో తాను మిస్టేక్‌ చేసినట్టు ఆయన రియలైజ్ కావడం, ఆ తర్వాత ఎమోషనల్‌ కావడం ఈ క్రమంలో వచ్చి ఎమోషన్‌ సీన్లతో ట్రైలర్‌ సాగింది. ఆద్యంతం ఎమోషన్‌ జర్నీగా అనిపించింది. నాని మళ్లీ ఎమోషన్స్ తో పిండేయడం విశేషం. 

YouTube video player

వరుసగా క్లాస్‌ మూవీస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు నాని. కానీ మాస్‌కి కాలేకపోయాడు. `దసరా`తో ఆ ప్రయత్నం చేశాడు. కొంత వరకు సక్సెస్‌ అయ్యాడు. తెలంగాణలో ఆ సినిమా బాగా ఆడింది. కానీ ఏపీలో ఆడలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ నాని ఫ్యామిలీ ఎమోషన్స్ సైడ్‌ తిరిగాడు. దీంతో తన మార్కెట్‌, కెరీర్‌ని మళ్లీ రిస్క్ లో పడేసుకుంటున్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ట్రైలర్ మెప్పించేలా ఉంది. ఇక ఈ మూవీ డిసెంబర్‌ 7న విడుదల కాబోతుంది.