Asianet News TeluguAsianet News Telugu

190 కోట్లతో లగ్జరీ హౌస్ కొన్న వాల్తేరు వీరయ్య బ్యూటీ 

హీరోయిన్ ఊర్వశి రాతెలా ఇంటి ధర బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. కోట్లు కుమ్మరించి ముంబైలో కుబేరులు నివసించే ప్రాంతంలో ఊర్వశి రాతెలా ఇల్లు కొన్నారట. 
 

heroine urvashi rautela bought la luxury house in mumbai ksr
Author
First Published Jun 1, 2023, 2:40 PM IST

ఉర్వశి రాతెలా మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. పలు జాతీయ, అంతర్జాతీయ బ్యూటీ కాంపిటీషన్స్ లో పాల్గొన్నారు. హీరోయిన్ గా, ఐటెం భామగా అనేక చిత్రాల్లో చేశారు. వాల్తేరు వీరయ్య మూవీతో ఊర్వశి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఊర్వశి రాతెలా 'బాస్ పార్టీ' సాంగ్ లో చిరుకు జంటగా బోల్డ్ స్టెప్స్ తో అలరించారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఒక్క సినిమాతో ఊర్వశి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది. 

అలాగే నటుడిగా మారిన వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ కి జంటగా ది లెజెండ్ మూవీ చేశారు. ఈ చిత్రంలో నటించినందుకు ఊర్వశి రాతెలా భారీ పారితోషికం తీసుకున్నారట. ది లెజెండ్ చిత్రాన్ని అరుళ్ శరవణన్ యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు. అరుళ్ కి జంటగా నటించేందుకు అంగీకరించిన ఊర్వశి రాతెలా ఒకింత ట్రోల్స్ కి గురయ్యారు. 

కాగా ఊర్వశి రాతెలా పేరు బాలీవుడ్ లో మారుమ్రోగుతుంది. అందుకు కారణం ఆమె కొన్న కొత్త ఇల్లు ధర. ముంబైలో కుబేరాలు నివసించే ఏరియాలో విలాసవంతమైన బంగ్లాను ఊర్వశి రాతెలా సొంతం చేసుకున్నారట. దీని ధర అక్షరాలా రూ. 190 కోట్లు అంటున్నారు. బడా బడా స్టార్స్ కూడా ఇంత ఖరీదైన భవనాలు కలిగిలేరు. అలాంటిది ఫుల్ టైం మోడల్, పార్ట్ టైం హీరోయిన్ ఊర్వశి రాతెలా వందల కోట్లతో ఇల్లు కొనడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. 

సకల సౌకర్యాలు కలిగిన ఈ ఆధునిక భవనంలో ఊర్వశి నివసిస్తున్నారట. కాగా నెక్స్ట్ ఊర్వశి రాతెలా బోయపాటి శ్రీను-రామ్ పోతినేని మూవీలో కనిపించనుంది. ఆ చిత్రంలో ఊర్వశి ఓ కీలక రోల్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios