Asianet News TeluguAsianet News Telugu

అలియా తండ్రి మహేష్ భట్ అందరి ముందు అవమానించాడంటున్న సీనియర్ హీరోయిన్ 


మాజీ మిస్ యూనివర్స్, హీరోయిన్ సుస్మితా సేన్ దర్శకుడు మహేష్ భట్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహేష్ తనను సెట్స్ లో అందరి ముందు అవమానించినట్లు వెల్లడించారు. తన డెబ్యూ మూవీ దస్తక్ షూటింగ్ సెట్స్ లో జరిగిన ఈ విషయాన్ని తాజాగా ఆమె బయటపెట్టారు. 
 

heroine sushmita sen says that i was insulted by director mahesh bhatt
Author
Hyderabad, First Published Jul 2, 2022, 6:49 PM IST


మోడల్ గా కెరీర్ ప్రారంభించిన సుస్మితా సేన్ 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ సొంతం చేసుకున్నారు. మిస్ యూనివర్స్ గా సుస్మితా పేరు అప్పట్లో మారుమ్రోగింది. ఈ క్రమంలో ఆమెకు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ ఓ రోజు ఫోన్ లో సుస్మితా సేన్ తో మాట్లాడారట. తన సినిమాలో హీరోయిన్ గా చేయాలని కోరారట. అయితే సుస్మిత నాకు నటన రాదని మహేష్ భట్ తో చెప్పారట. అది పెద్ద సమస్య కాదు, మీరు సినిమాకు సైన్ చేయమని ఒప్పించారట. 

ఫస్ట్ డే షూట్ లో చుట్టూ పదుల సంఖ్యలో క్రూ ఉండగా సుస్మితా(Sushmita Sen) కెమెరా ముందు సరిగా చేయలేదట. దానికి మహేష్ సీరియస్ అయ్యారట. ఈ మాత్రం ప్రతిభతోనే మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్నావా? అని ఆమెను ఎద్దేవా చేశారట. దీంతో తీవ్ర కోపానికి గురైన సుస్మితా నాకు నటన రాదని ముందే చెప్పాను, ఇంత మంది ముందు నన్ను అవమానిస్తారా అంటూ కోపంగా, సెట్స్ నుండి వెళ్ళిపోబోయారట. అప్పుడు మహేష్ భట్ చేయి పట్టుకొని ఆపి... కోపం అంటే ఇదే, కెమెరా ముందు ఇలానే నటించు అన్నారట. అప్పుడు అసలు విషయం అర్థమై ఆయనపై గౌరవం పెరిగిందట. మహేష్ అందుకే అంత పెద్ద డైరెక్టర్ అయ్యారని సుస్మితా తెలియజేశారు. 

అక్షయ్ కుమార్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా ది ఐకాన్స్ పేరుతో ఓ టాక్ షో నిర్వహిస్తుంది. ఈ షోలో పాల్గొన్న సుస్మితా తన ఫస్ట్ మూవీ దస్తక్ సెట్స్ లో జరిగిన విషయాన్ని వెల్లడించింది. 1996లో దస్తక్ విడుదల కాగా.. సుస్మితా హీరోయిన్ గా, ఐటెం భామగా కొన్ని చిత్రాలు చేశారు. అయితే ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆమె ప్రధాన పాత్రలో ఆర్య టైటిల్ తో వెబ్ సిరీస్ ప్రసారం అవుతుంది. ఫస్ట్ సీజన్ సక్సెస్ నేపథ్యంలో సెకండ్ సీజన్ సైతం తెరకెక్కించారు. 

ఇక పెళ్లి చేసుకోని సుస్మితా సేన్ మోడల్ రోహ్మన్ షాల్ తో సహజీవనం చేసింది. 2021 లో అతనితో కూడా ఆమె విడిపోయారు. అనాథలైన ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్న సుస్మితా సేన్ వారే ప్రపంచంగా బ్రతుకుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios