దక్షిణాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార ఇప్పటికీ తన హవా కొనసాగిస్తూనే ఉంది. సౌత్ లో ఏ హీరోయిన్ కూడా నయన్ తీసుకునేంత రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇప్పట్లో మరో హీరోయిన్ ఆమెని రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొస్తుంది. రీసెంట్ గా ఆమె నటించిన 'కోకో కోకిల', 'ఇమైక నోడిగల్' వంటి సినిమాలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఆమె విజయ్ హీరోగా నటిస్తోన్న ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కొన్ని రోజుల పాటు నిర్మాతలను వెయిట్ చేయించిన అనంతరం ఆమె సినిమాకి ఓకే చెప్పింది. ఆమె సినిమా ఒప్పుకోవడంతో నిర్మాతల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. తమ సినిమాలో నయన్ హీరోయిన్ అంటూ తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఓ స్టార్ హీరోతో సినిమా అనౌన్స్ చేసినంత హడావిడి చేస్తున్నారు.

దీంతో మరోసారి నయన్ క్రేజ్ ఎంతగా ఉందో నిరూపితమవుతోంది. గతంలో నయన్.. విజయ్ తో కలిసి 'విల్లు' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో 
వీరి కాంబినేషన్ లో మరో సినిమా చేయడానికి ఎవరూ ప్రయత్నించలేదు. మళ్లీ ఇన్నిరోజులకు విజయ్-నయన్ కాంబినేషన్ లో సినిమా చూడబోతున్నారు. ఈ సినిమాని అట్లీ డైరెక్ట్ చేస్తుండగా, రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.