డిప్రెషన్ లో తోడున్న ఫ్రెండ్ కి బర్త్ డే విషెస్ చెప్పిన సమంత... ఎవరో తెలుసా?
కష్టకాలంలో తోడుగా ఉన్న ఫ్రెండ్ కి సమంత బర్త్ డే విషెస్ చెప్పింది. బెస్ట్ ఫ్రెండ్ పై అభిమానం చాటుకుంది. సమంత పోస్ట్ వైరల్ అవుతుంది.

నాగ చైతన్యతో విబేధాలు తలెత్తగా సమంత ఆయనకు దూరమయ్యారు. నాగచైతన్య-సమంత విడిపోయిన కొద్దిరోజులు మేటర్ లీకైంది. సమంత సోషల్ మీడియాలో అక్కినేని సర్ నేమ్ తొలగించడంతో అనుమానాలు మొదలయ్యాయి. 2021 అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకులు తీసుకుంటున్నట్లు స్పష్టత ఇచ్చారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు వెల్లడించారు.
ఈ సమయంలో సమంత తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి దూరం కావడాన్ని ఆమె తట్టుకోలేకపోయారు. దానికి తోడు సోషల్ మీడియా వేధింపులు. ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అలాంటి కఠిన పరిస్థితుల్లో సమంతకు ఓ వ్యక్తి అండగా నిలిచింది. ఆమె శిల్పారెడ్డి. హైదరాబాద్ కి చెందిన శిల్పారెడ్డి సమంత బెస్ట్ ఫ్రెండ్. చాలా కాలంగా వీరికి పరిచయం ఉంది.
శిల్పారెడ్డి ఫ్యాషన్ డిజైనర్, డైట్ అండ్ ఫిట్ నెస్ ఎక్స్పర్ట్. పలు విషయాల్లో శిల్పారెడ్డి సలహాలను సమంత పాటించేవారు. ఆ విధంగా సమంత ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యింది. ఇక సమంత డిప్రెషన్ నుండి బయటపడడంతో శిల్పారెడ్డి కీలక పాత్ర పోషించింది. సమంత, శిల్పారెడ్డి పుణ్యక్షేత్రాలు తిరిగారు. నచ్చిన ప్రదేశాలకు విహారానికి వెళ్లారు. అప్పట్లో సమంత శిల్పారెడ్డి ఫ్యామిలీతో తరచుగా కలిసి కనిపించేవారు.
జులై 21న శిల్పారెడ్డి బర్త్ డే నేపథ్యంలో సమంత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పింది. మరోవైపు సమంత ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఖాళీగా ఉన్న సమంత మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక బాట పట్టారు. తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ ని సందర్శించారు. అలాగే సద్గురు ఆశ్రమం సందర్శించారు. చికిత్స కోసం అమెరికా వెళుతున్న సమంత ఏడాది పాటు సినిమాలు చేయరంటూ ప్రచారం జరుగుతుంది.