Asianet News TeluguAsianet News Telugu

వాళ్లు అలా.. నేను ఇలా..? తల్లీ తండ్రులపై నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్, ఏమంటుందంటే..?

తన తల్లీ తండ్రుల ఆలోచనలకు ఆపోజిట్ గా తాను పెరిగానంటోంది హీరోయిన్ నిత్య మీనన్. తన పేరెంట్స్ గురించి మలయాళ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమంటోందటే..? 
 

Heroine Nithya Menon Shocking Comments about Her Parents JMS
Author
First Published Nov 9, 2023, 1:35 PM IST

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైనస్థానం సంపాదించుకుంది హీరోయిన్ నిత్య మీనన్. అన్నిసినిమాలు ఒప్పుకోకుండా.. సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ.. ఇమేజ్ ను కాపాడుకుంటూ వస్తోంది. అవ్వడానికిమలయాళ హీరోయిన్ అయినా.. అచ్చతెలుగు భామలా కనిపిస్తుంది. స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. 

తెలుగులో మంచిమంచి సినిమాలు చేసింది నిత్య. ఎక్స్ పోజింగ్ కు.. వల్గారిటీకి దూరంగా ఉంటుంది. లిప్ లాక్ లను మరింత దూరంగా ఉంటూ.. మంచి మంచిసినిమాలు మాత్రమేచేసుకుంటూ ఉంటుంది. ఇక ప్రస్తుతం తెలుగులో ఆమెకు సినిమాలు లేవు. యాడ్ ఫిల్స్ కొన్ని చేసిన ఈ భ్యూటీ.. తాజాగా కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ద్వారా ఆడియన్స్ ను పలకరించింది. 

ఈ వెబ్ సిరీస్ కు మంచి పేరు వచ్చింది. ఇందులో లీడ్ రోల్ చేస్తూ.. హీరో అనిపించుకుంది నిత్య. తన స్వభావానికి దగ్గరగా ఉన్న పాత్ర కావడంతో.. ఎంతో అద్భుతంగా శ్రీమతి పాత్రను పండించగలిగింది బ్యూటీ. ఇక సినిమాల విషయానికి వస్తే..  గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ చిత్రం లో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించిన నిత్యా మీనన్, ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరకి కనిపించలేదు. 

ప్రస్తుతం విరామం తీసుకుంటున్న నిత్యా మీనన్ వచ్చే ఏడాది నుండి మళ్లీ సినిమాలతో బిజీ కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకి సంబంరందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తన కుటుంబానికి సబంధిచిన విషయాల కూడా కొన్నిపంచుకుంది బ్యూటీ. 

ఆమె మాట్లాడుతూ చిన్నప్పటి నుండి నన్ను ఇంట్లో దేవుడికి దూరంగా పెంచుతూ వచ్చారు. నా తల్లితండ్రులు ఇద్దరూ నాస్తికులు. ఇప్పటి వరకు మేము ఉన్న ఇళ్లల్లో కనీసం పూజ గది కూడా లేదు. సాధారణంగా తల్లితండ్రులు పెంచిన పెంపకం బట్టి అలవాట్లు ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. కానీ చిన్నతనం నుండి నాస్తికత్వం తో నన్ను పెంచినప్పటికీ, ఎందుకో నాలో దైవ భక్తి ఎవరి ప్రమేయం లేకుండానే వచ్చేసింది అంటూ సీక్రెట్ చెప్పేసింది నిత్య. 

అంతే కాదు తను ఇంత భక్తురాలు అయినా.. తనకు ఇంట్లో ఎటుంటి రిస్టెక్షన్స్  పెట్టరట. అంతే కాదు తాను  దేవుడికి మొక్కనిదే ఇప్పుడు నేను ఏ పని ప్రారంభించడం లేదు అంటూ చెప్పుకొచ్చింది నిత్య మీనన్.  ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంత నాస్తికత్వం ఉన్న కుటుంబం లో పెరిగినా కూడా నిత్యా మీనన్ అంత మంచి భక్తురాలు ఎలా అయ్యిందబ్బా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. 

ఇక తనను ఇంట్లో పెళ్లి గురించి ఎవరూ అడగంటోంది. తన ఇష్టానికి ఇంపార్టెన్స్ ఇస్తారట. కాని తన భామ్మ మాత్రమే తనను హీరోయిన్ గా చూడదని.. బయట సెలబ్రిటీగా ఉన్నా.. అదేమి లెక్కచేయదంటోంది. ఇంత వరకూ ఏం సాధించావు.. ఇకనైనా పెళ్లి చేసుకో అని సతాయిస్తుదంట. అంతే కాని ఇంట్లో తనను ప్రశ్నించే సాహసం ఎవరూ చేయరు అంటోంది నిత్య.


 

Follow Us:
Download App:
  • android
  • ios