తన ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది నాని హీరోయిన్... నజ్రియా నజీమ్. సోషల్ మీడియాకు సబంధించి ఆమె తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం అంతటా హాట్ టాపిక్ గా మారింది.
నజ్రియా నజీమ్ అంటే చాలా మందికి పెద్దగా తెలియకపోవచ్చు.. అదే నాని..అంటే సుందరానికి సినిమా చూసినవారికి ఆమెను అసలు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. కాస్తో కూస్తో తెలియనివారికిరాజా రాణి హీరోయిన్ అని గుర్తు చేస్తే చాలు. అంటే సుందరానికి సినిమాలో నానీ జోడీగా నటించింది నజ్రియా నజీమ్. అయితే ఈహీరోయిన్ కు పేరు తీసుకువచ్చింది మాత్రం ఇంతకు ముందే వచ్చిన రాజారాణి మూవీ.
అవ్వడానికి తమిళ డబ్బింగ్ సినిమానే అయినా.. రాజారాణి సినిమాతో నజ్రియాకు టాలీవుడ్ యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ లభించింది. ఈసినిమా తరువాత నజ్రియా ఇమేజ్ ఎక్కడికోవెళ్లిపోయింది. ఇక ఆతరువాత చాలా కాలానికి రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని జోడీగా నటించిందిబ్యూటీ. అంటే సుందరానికి సినిమాతో మంచిం సక్సెస్ ను తన ఖాతాలోవేసుకుంది
ఈ మూవీ తరువాత మంచి మంచి ఆఫర్లు సాధిస్తుంది అనుకుంటే.. టాలీవుడ్ లో అసలు సినిమాలు చేయడమే మానేసింది నజ్రియా. అంతే కాదు అసలు నజ్రియాకుఈసినిమా తరువా పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. దాంతో టాలీవుడ్ లో సినిమాలు చేయడం మానేసింది బ్యూటీ. అయినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవగా ఉండేది నజ్రియా. తనకు తన భర్తకు సబంధించిన విషయాలను సోషల్ మీడియాలో రకరకాల విషయాలు పంచుకుంటూ ఉండేది.
ఇక తాజాగా నజ్రియా ఓ సడెన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుందట బ్యూటీ. నెట్టింట్లో నుంచి బయటకు రావాలని ఆమె డిసిషన్ తీసుకున్నట్టు సమాచారం. నిశ్చయించుకున్నారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. తనుఅనుకున్న పాయింట్స్ ను వివరంగా చెప్పింది.
నేను నా అన్ని సోషల్ మీడియా ఖాతాల ప్లాట్ ఫామ్స్ నుంచి బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాను. నేను మీ ప్రేమ, సందేశాలను చాలా మిస్ అవుతాను. నేను మళ్లీ తిరిగి వస్తాను. నేను ప్రమాణం చేస్తున్నాను అని పేర్కొన్నారు. దాంతో ఆమె ఫ్యాన్స్ డిస్సాయింట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
