భారీగా రేటు పెంచేసిన నయనతార... ఎన్ని కోట్లు అంటే?
పెళ్ళైనా నయనతార డిమాండ్ ఇంచు కూడా తగ్గలేదు. మరో పదేళ్లు ఈజీగా సిల్వర్ స్క్రీన్ ని ఏలేలా ఉంది. జవాన్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన నయనతార పారితోషికం పెంచేశారట.

లేడీ సూపర్ స్టార్ నయనతార పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. చంద్రముఖి, గజినీ చిత్రాలతో స్టార్ గా ఎదిగిన నయనతార తెలుగులో కూడా సత్తా చాటింది. లక్ష్మి, యోగి, అదుర్స్, సింహ చిత్రాలతో టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరైంది. లైఫ్ లో ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా ఆమె కెరీర్ నెమ్మదించలేదు. అంతకంతకూ ఎదుగుతూ ఉంది.
జవాన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయనతార అక్కడ కూడా సత్తా చాటింది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా తనకు తిరుగు లేదని నిరూపించింది. షారుఖ్ ఖాన్ కి జంటగా ఆమె నటించిన జవాన్ మూవీ వరల్డ్ వైడ్ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ చిత్రానికి నయనతార రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
జవాన్ సక్సెస్ నేపథ్యంలో నయనతార మరో మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నారట. రూ. 13 కోట్లు ఇస్తే కానీ సినిమా చేయను అంటున్నారట. ఇది టైరు టూ హీరోల రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. సౌత్ లో పది కోట్లు తీసుకుంటున్న హీరోయిన్స్ ఎవరూ లేరు. తన రికార్డు తానే బద్దలు కొడుతూ పదమూడు కోట్లు కావాలని అంటుందట. ఈ మేరకు చిత్ర పరిశ్రమలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం నయనతార తన 75వ చిత్రంలో నటిస్తుంది. జయం రవికి జంటగా తనివొరువన్ 2తో పాటు కొన్ని చిత్రాలలో నటిస్తుంది. గత ఏడాది తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ ని పెళ్లాడింది. పెళ్ళైన వెంటనే సరోగసి పద్దతిలో ఇద్దరు కవులు అబ్బాయిలను కన్నది. ఇది వివాదం కాగా.. సరైన పత్రాలు చూపించి బయటపడింది.