సీనియర్ హీరోయిన్ మీనా లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రముఖ హీరో తన క్రష్ అని చెప్పిన మీనా, ఆయన పెళ్లి రోజు చాలా ఫీలైనట్లు వెల్లడించారు. 

హీరోయిన్ మీనా 40 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఆరేళ్ళప్రాయంలో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. 1982లో విడుదలైన నేన్జంగల్ మీనా మొదటి చిత్రం. 1990లో నవయుగం మూవీతో హీరోయిన్ అయ్యారు. ఈ నాలుగు దశాబ్దాల ప్రయాణంలో స్టార్ హీరోయిన్ గా మీనా సౌత్ ఇండియాను ఏలారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక చిత్రాలు చేసిన ఆమె మలయాళ, కన్నడ భాషల్లో కూడా విరివిగా నటించారు నటించారు. 

ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఆమె హీరోయిన్ గా నటించడం విశేషం. మోహన్ లాల్, వెంకటేష్ వంటి హీరోల సరసన ఆమె కీలక రోల్స్ దక్కించుకుంటున్నారు. పరిశ్రమలో నాలుగు పదుల ప్రస్థానం పూర్తయిన సందర్భంగా... మీనా ప్రముఖ తమిళ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. 

వివాహం కాకముందు హీరో హృతిక్ రోషన్ అంటే మీనాకు క్రష్ అట. ఆయన్ని ఎంతగానో ఇష్టపడేవారట. తనకు అలాంటి అబ్బాయితో పెళ్లి చేయమని వాళ్ళ అమ్మతో చెప్పారట. ఇక హృతిక్ పెళ్లి రోజు మీనా చాలా ఫీల్ అయ్యారట. తన గుండె బద్దలైందని మీనా ఓపెన్ గా చెప్పారు. హృతిక్ రోషన్ 2000 సంవత్సరంలో ఫ్యాషన్ డిజైనర్ సుసానే ఖాన్ ని వివాహం చేసుకున్నారు. 2014లో హృతిక్ రోషన్ ఆమెకు విడాకులిచ్చారు. వీరికి ఇద్దరు సంతానం. 

కాగా మీనా 2009లో బెంగుళూరుకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు. గత ఏడాది జూన్ 28న మీనా జీవితంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం పొందారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన విద్యాసాగర్ అనూహ్యంగా కన్నుమూశారు. భర్త మరణం మీనాను తీవ్ర వేదనకు గురి చేసింది. తక్కువ ప్రాయంలోనే ఆమె తోడును కోల్పోయారు. మీనాకు నైనిక అనే ఒక కూతురు ఉన్నారు. విద్యాసాగర్ మరణంతో మీనా, నైనిక ఒంటరివాళ్లయ్యారు.

ఆ మధ్య మీనా రెండో వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మీనా వయసు 46 సంవత్సరాలు. ఈ క్రమంలో పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నాయి. కూతురు నైనికతో పాటు తన భవిష్యత్ కోసం పెళ్లి చేసుకునే అవకాశం కలదంటున్నారు. ప్రస్తుతం మీనా జనమ్మ డేవిడ్ అనే మలయాళ చిత్రం చేస్తున్నారు.