చాలా కాలం తరువాత కనిపించి మాజీ హీరోయిన్ లయ.. మాస్ స్టెప్పులతో మెస్మరైజ్ చేస్తోంది. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.
హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అచ్చతెలుగు హీరోయిన్లలో మన దగ్గర ఎక్కువ సినిమాలు చేసిన చివరి హీరోయిన్ లయనే. ఇక పెళ్ళి తరువాత ప్యామిలీ లైఫ్ కే పరిమితం అయిపోయిన లయ.. పిల్లలు పుట్టి వాళ్లు పెద్దవాళ్లు అయినా.. కనీసం కనిపించడం మానేసింది. ఫారెన్ లో ఉంటూ.. కుటుంబ బాధ్యతలు చూసుకుంటోంది.
స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ లాంటి మంచి సినిమాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అందాల తార లయ. ప్రస్తుతం కాలిఫోర్నియాలో తన ఫ్యామిలీతో కలిసి సెటిలైంది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆ లోటును తీరుస్తుంది లయ. ఎప్పటికపుడు ట్రెండీ పాటలతో నెట్టింట సందడి చేస్తుంటుంది.
రీసెంట్ గా సర్కారు వారి పాట నుంచి పెన్నీ సాంగ్ కు అదిరిపోయే స్టైలిష్ స్టెప్పులేసి లయ అదరహో అనిపించింది. గతంలో తన ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన లయ..ఈ సారి కూతురితో కలిసి డ్యాన్స్ చేసింది. కూతురు శ్లోక తో కలిసి బ్లాక్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ తో వీడియో చేసి.. శభాష్ అనిపించింది.
స్లైలిష్ గా స్టెప్పులేసి..తళ్లీకూతుళ్లు పెన్నీ పాటను రీక్రియేట్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.ఇద్దరిలో ఎవరు లయ, ఎవరు శ్లోక అని గుర్తు పట్టలేనంతగా పాటలో లీనమైపోయి డ్యాన్స్ చేశారు. లయ, శ్లోక డ్యాన్సింగ్ స్కిల్స్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ.. ఇద్దరిని పొగుడుతూ.. రకరకాల కామెంట్లు పెట్టారు.
ఇక రీసెంట్ గా మరో సాంగ్ కు డాన్స్ చేసి అప్ లోడ్ చేసింది లయ. రామ్-కృతిశెట్టి కాంబోలో వచ్చిన బుల్లెట్ సాంగ్‌కు కాలిఫోర్నియా వీధుల్లో ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో కూడా నెట్టింట్లో ఫ్యాన్స్ తో శేర్ చేసుకుంది లయ. మొత్తానికి లయ ఇలా యాక్టీవ్ అవ్వడంతో.. సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
