హీరోయిన్ కీర్తి సురేష్ సిస్టర్ రేవతి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఆమె నటిగా కాకుండా డైరెక్టర్ అవతారం ఎత్తారు.  

కీర్తి సురేష్ తల్లి మేనక సీనియర్ హీరోయిన్. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కాగా చిన్నమ్మాయి కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి అంచలంచెలుగా ఎదిగి తల్లికి దగ్గ కూతురు అనిపించుకున్నారు. కీర్తి సురేష్ అక్క పేరు రేవతి సురేష్. ఈమె నటి కాలేదు. పేరెంట్స్ పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. అయితే ఆమెకు పరిశ్రమ వైపు మనసు మళ్లింది. 

రేవతి సురేష్ లేడీ డైరెక్టర్ అవతారం ఎత్తింది. థాంక్ యూ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. కీర్తి సురేష్ అక్క డైరెక్టర్ కావడం హాట్ టాపిక్ అవుతుంది. కీర్తి ఫ్యాన్స్ అక్కకు కూడా బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ఈమె డైరెక్టర్ గా రాణించాలని కోరుకుంటున్నారు. 

View post on Instagram

ఇక కీర్తి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల రివాల్వర్ రాణి టైటిల్ తో కొత్త మూవీ ప్రకటించారు. ఒక ప్రక్కన స్టార్స్ తో చిత్రాలు చేస్తున్న కీర్తి, సిస్టర్స్ రోల్స్ చేయడం కొసమెరుపు. ఈ తరహా ప్రయోగం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. చెల్లెలు పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. 

అలాగే తమిళంలో జయం రవికి జంటగా సైరన్ టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న మామన్నన్ మూవీలో కీర్తి నటిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన కీర్తి ఆ అవకాశాలు వస్తే వదులుకోవడం లేదు. అమెజాన్ ఒరిజినల్ చిన్ని మూవీలో సీరియల్ కిల్లర్ గా అలరించారు.తల్లి వారసత్వాన్ని నిలబెడుతూ కీర్తి స్టార్ గా ఎదిగారు.