Asianet News TeluguAsianet News Telugu

`గేమ్‌ ఛేంజర్‌`లో తన పాత్రపై అంజలి వివరణ.. కీ రోల్‌ కాదు, హీరోయిన్‌.. `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`లోనూ..

హీరోయిన్‌ అంజలి హీరోయిన్‌గా ఆఫర్ల విషయంలో, అలాగే తాను క్యారెక్టర్‌ గా టర్న్ తీసుకుంటున్న నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చింది అంజలి. తనది కీ రోల్‌ కాదంటూ క్లారిటీ ఇచ్చింది. 
 

heroine Anjali clarity on roles in game changer and gangs of Godavari arj
Author
First Published May 26, 2024, 8:48 PM IST

హీరోయిన్‌ అంజలి చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. ఆమె తెలుగులో చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఆ మధ్య `గీతాంజలి2`లో మెరిసింది. ఇప్పుడు `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` చిత్రంతో రాబోతుంది. విశ్వక్ సేన్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో అంజలి రత్నమాల అనే అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది. నేహా శెట్టి విశ్వక్‌ కి జోడీగా చేస్తుంది. ఇందులో అంజలి పాత్ర చాలా లౌడ్‌గా ఉంటుందట. పాత్ర తీరు అలానే ఉంటుందని, తన స్వభావం అలానే ఉంటుంది. అంతేకాదు ఇప్పటి వరకు తాను ఇలాంటి పాత్ర చేయలేదని చెబుతుంది అంజలి. 

ఈ క్రమంలో ఆమె ఓ విషయంపై క్లారిటీ ఇచ్చింది. `గేమ్‌ ఛేంజర్‌`, `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` చిత్రాల్లో తనది కీ రోల్స్ అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై అంజలి వివరణ ఇచ్చింది. తనది కీ రోల్స్ కాదని, హీరోయిన పాత్ర అని తెలిపారు. హీరోహీరోయిన్‌ కోణంలో చూస్తే `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` ఒక హీరో ఇద్దరు హీరోయిన్ల కోణంలో సాగుతుందని, కానీ సినిమా కథగా చూసినప్పుడు రత్నకుమార్‌, రత్నమాల, బుజ్జి, నాజర్‌ పాత్రల చుట్టూ తిరిగే కథ, ఈ నాలుగు పాత్రల మెయిన్‌గా సినిమా సాగుతుందని, ఈ పాత్రలన్నింటికి సమాన ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది అంజలి. 

ఈ సందర్భంగా `గేమ్‌ ఛేంజర్‌` సినిమాలో తన పాత్ర గురించి కూడా వివరణ ఇచ్చింది అంజలి. అందులో కూడా తనది కీ రోల్‌ కాదని, హీరోయిన్‌ పాత్ర అని తెలిపింది. కియారా అద్వానీ ఓ హీరోయిన్‌ అయితే, తాను మరో హీరోయిన్‌ అని చెప్పింది. తన పాత్ర చాలా బలంగా, చాలా కొత్తగా ఉందని వెల్లడించింది. తనపై ఓ సాంగ్‌ కూడా ఉంటుందని చెప్పింది. కీ రోల్స్ అయితే సాంగ్‌ ఉండదని చెప్పింద అంజలి. అయితే ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో తన పాత్రనే కీలకమని తెలుస్తుంది. ఇందులో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రి పాత్ర రాజకీయ నాయకుడిగా ఉంటాడని, ఆయనకు జోడీగా అంజలి కనిపిస్తుందని తెలుస్తుంది. ఆ ఎపిసోడ్‌లోనే చరణ్‌, అంజలి మధ్య సాంగ్‌ ఉంటుందట. 

అయితే `గేమ్‌ ఛేంజర్‌` మూవీ గురించి తాను ఏ విషయం చెప్పలేనని, నిర్మాత, దర్శకుడు సినిమా గురించి మాట్లాడకుండా తాను మాట్లాడటం సరి కాదని, తనకు సినిమా గురించి మాట్లాడాలని చాలా ఉంది. కానీ మౌత్‌కి సీల్‌ వేశారని, సినిమా గురించి నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు శంకర్‌ మాత్రమే మాట్లాడాలని తెలిపారు అంజలి. కానీ తన పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని చెప్పింది. తన పాత్రకి సంబంధించి కొంత షూటింగ్‌ అయ్యిందని, మరికొంత ఉందని చెప్పింది. సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేసేందుకు టీమ్‌ ప్రయత్నిస్తుందని చెప్పింది అంజలి. రామ్ చరణ్  గురించి చెబుతూ ఆయన పాత్ర కోసం నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి పరితపిస్తారు.  తన పాత్ర విషయంలోనే కాకుండా.. సినిమాలోని ఇతర పాత్రధారులకు కూడా అంతే సహకారం అందిస్తారు. నాకు ఎంతో కంఫర్ట్ ని ఇస్తారు చరణ్‌ అని తెలిపింది అంజలి.

సినిమా అవకాశాల పరంగా తాను బిజీగానే ఉన్నానని తెలిపింది. తెలుగులో `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`, `గేమ్‌ ఛేంజర్‌`తోపాటు మరో ఒకటిరెండు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయని, తమిలఃలో మూడు సినిమాలు చేస్తున్నట్టు, అలాగే మలయాళంలో ఓ మూవీ చేస్తున్నట్టు తెలిపింది అంజలి. మరోవైపు `బహిష్కరణ` అనే వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ కంప్లీట్ అయ్యిందని,కానీ రిలీజ్‌ సమస్య ఉందన్నారు. దీంతోపాటు మరో వెబ్‌ సిరీస్‌ కూడా చేసినట్టు తెలిపింది అంజలి.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios