వయసులో ఆ కోరిక కలిగింది... ఇప్పుడు లేదు! హీరోయిన్ ఆండ్రియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆండ్రియా జెర్మియాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నటి కమ్ సింగర్ ఆండ్రియా జెర్మియా చాలా బోల్డ్. ఆమె జీవితంలో పలు వివాదాలు ఉన్నాయి. ఆండ్రియా 2005లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. కండ నాల్ ముదల్ ఆమె మొదటి చిత్రం. కార్తీ హీరోగా నటించిన ఆయిరతి ఒరువన్ మూవీతో ఆమెకు పాపులారిటీ వచ్చింది. ఈ మూవీ తెలుగులో యుగానికి ఒక్కడు టైటిల్ తో విడుదలైంది. విశ్వరూపం మూవీలో ఆండ్రియా కీలక రోల్ చేసింది.
తెలుగులో ఆండ్రియా సునీల్ కి జంటగా తడాఖా చిత్రం చేసింది. నాగ చైతన్య మరో హీరో. తమన్నా మెయిన్ హీరోయిన్ గా చేసింది. తుప్పరివాలన్ మూవీలో లేడీ విలన్ రోల్ లో అలరించింది. వెంకటేష్ లేటెస్ట్ మూవీ సైంధవ్ లో ఆండ్రియా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటిగా, సింగర్ గా ఆమె సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తుంది. ఆండ్రియాను తాజా ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడగ్గా ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ... ఒక వయసుకు వచ్చాక ప్రతి అమ్మాయికి పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. నాకు కూడా 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనిపించింది. అయితే ఇప్పుడు ఆ ఆలోచన లేదు. ఆ వయసు దాటిపోయింది. ఒంటరిగా ఉండటం వలన నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదని, అన్నారు. దాంతో ఆండ్రియా జీవితాంతం ఒంటరిగా జీవించాలని డిసైడ్ అయినట్లు అర్థం అవుతుంది.
కాగా గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ తో ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పట్లో ఈ ఫోటోలు సంచలనం రేపాయి. అలాగే ఓ పెళ్ళైన వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నాను. అది డిప్రెషన్ కి దారి తీసిందని ఆండ్రియా చెప్పడం కొసమెరుపు.