స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఒక ఊపు ఊపింది త్రిషా. ముఖ్యంగా టాలీవుడ్ లో ఆమె ఓ రేంజ్ స్టార్ డమ్ అనుభవించారు. దాదాపు అందరు టాప్ స్టార్స్ కి జంటగా నటించిన త్రిషా దశాబ్దానికి పైగా టాలీవుడ్ ని ఏలారు. ప్రస్తుతం త్రిషకు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేవు. ఆమె ఎక్కువగా తమిళంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. 

కాగా త్రిష వయసు ప్రస్తుతం 37 సంవత్సరాలు. ఆమె పెళ్లిపై తరచుగా వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం చెన్నైకి చెందిన ఓ పారిశ్రామిక వేత్తతో ఆమెకు నిశితార్థం జరిగింది. కారణాలేమైనా ఆ వివాహం జరగలేదు. ఇక హీరో రానాతో త్రిష ప్రేమ వ్యహారం నడిపినట్లు కూడా వార్తలు రావడం జరిగింది. రానా కూడా ఇటీవలే పెళ్లి చేసుకొని సెటిలై పోయాడు. 

తాజాగా త్రిష హీరో శింబు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కథనాలు రావడం జరిగింది. ఈ వార్తలపై త్రిష, శింబు స్పందించలేదు. ఐతే పెళ్లి విషయంపై త్రిష స్పందించారు.పెళ్లి గురించి తన అభిప్రాయం తెలియజేశారు. 

తన అభిప్రాయాలను, వృత్తిని గౌరవించేవాడిని నేను వివాహం చేసుకుంటానని త్రిష అన్నారు. అలాంటివాడు దొరకని పక్షంలో ఒంటరిగా ఉండడానికైనా ఇష్టమే అని త్రిష చెప్పడం విశేషం.