బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ లో ఇప్పటికే ఇద్దరు ఇంటి దారిపట్టారు. మొదటి వారం దర్శకుడు సూర్య కిరణ్ ఎలిమినేట్ కావడం జరిగింది. కాగా నిన్న ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున నటి కరాటే కల్యాణిని ఇంటిదారి పట్టించారు. ఈవారం డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జున స్పష్టం చేయగా నేడు మరొక కంటెస్టెంట్ ఇంటి నుండి బయటికి వెళ్లిపోనున్నారు. మొత్తంగా రెండు వారాల వ్యవధిలో ముగ్గురు ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఉద్వాసన పలకనున్నారు. 

ఐతే ఒకరిని ఎలిమినేట్ చేసిన వెంటనే మరొకరిని ఇంటిలోకి బిగ్ బాస్ పంపిస్తున్నారు. సూర్య కిరణ్ ఎలిమినేషన్ ని కమెడియన్ కుమార్ సాయితో రీప్లేస్ చేసిన బిగ్ బాస్ వారంలోపే, జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ ని హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపారు. ఇప్పటికే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పూర్తికాగా, మరో వైల్డ్ కార్డు ఎంట్రీని సిద్ధం చేసినట్లు సమాచారం. 

మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ కి గ్లామర్ టచ్ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. దీనికోసం బిగ్ బాస్ హౌస్ లోకి నేడు యంగ్ హీరోయిన్ స్వాతి దీక్షిత్ ఎంటర్ కానుందట. స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డు ఎంట్రీ దాదాపు ఖాయమే అని గట్టిగా వినిపిస్తుంది. మరి కొన్ని గంటల్లో దీనిపై స్పష్టత రానుంది.