హీరోయిన్ శృతి హాసన్ కెరీర్ చిన్నగా ఊపందుకుంటుంది. బ్రేక్ తీసుకున్న శృతి కెరీర్ ఇబ్బందుల్లో పడింది. అయితే అనూహ్యంగా సలార్ మూవీలో అవకాశం దక్కించుకొని, మరలా రేసులోకి వచ్చింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. కాగా ఈ చిత్రంలో తన పాత్రపై వస్తున్న పుకార్లకు శృతి హాసన్ చెక్ పెట్టారు. సలార్ మూవీతో పాటు ప్రభాస్ పై ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


సలార్ మూవీలో తాను యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తున్నాను అంటూ వార్తలు వస్తున్నాయి. వాటిలో ఎంత మాత్రం నిజం లేదు అన్నారు. తనకు ఫైట్ సన్నివేశాలు ఉండవు అని స్పష్టత ఇచ్చారు. ఇక ప్రభాస్ మూవీలో అవకాశం రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అన్నారు. ప్రభాస్ చాలా నిరాడంబరంగా ఉంటారు. చాలా మంది అలా ఉంటున్నట్లు నటిస్తారు. ప్రభాస్ నిజంగానే సింప్లిసిటీ కలిగిన వ్యక్తి అని శృతి హాసన్ తెలిపారు. 


ఇంకా మాట్లాడుతూ ప్రభాస్ అందరితో చాలా బాగా మాట్లాడతారు. ఆయన సెట్ లో ఉంటె ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇక  ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సమ్మర్ కానుకగా 2022లో విడుదల కానుంది. ఇక శృతి హాసన్ పవన్ కి జంటగా నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదల కానుంది. తమిళంలో విజయ్ సేతుపతి జంటగా లాభం మూవీలో ఆమె నటించారు. పిట్ట కథలు పేరుతో తెరకెక్కిన ఆంథాలజీ సిరీస్ లో శృతి నటించిన విషయం తెలిసిందే.