Asianet News TeluguAsianet News Telugu

నిశ్చితార్థం తరువాత కాబోయేవాడికి హ్యాండిచ్చిన హీరోయిన్

 సబా కమర్ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. నిశ్చితార్ధం జరుపుకున్న వ్యక్తితో తనకు బ్రేకప్ అయినట్లు చెప్పి ఆమె అందరికీ షాక్ ఇచ్చింది.

heroin saba qamar reveals that she broke up with engaged boy friend ksr
Author
Hyderabad, First Published Apr 3, 2021, 10:52 AM IST

పాకిస్థాన్ హీరోయిన్ సబా కమర్ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. నిశ్చితార్ధం జరుపుకున్న వ్యక్తితో తనకు బ్రేకప్ అయినట్లు చెప్పి ఆమె అందరికీ షాక్ ఇచ్చింది. ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రధాన పాత్రలో నటించిన హిందీ మీడియం తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాకిస్థానీ నటి సబా కమర్‌. వ్యాపారవేత్త అజీమ్‌ ఖాన్‌తో ఇటీవల ఆమె నిశ్చితార్థం జరిగింది. ఇంకొద్ది రోజులలో పెళ్లి అనగా సబా వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్లు తెలియజేసింది.

 

సబా తన సోషల్ మీడియా అకౌంట్ లో 'వ్యక్తిగత కారణాల వల్ల అజీమ్ ఖాన్‌తో నా ఎంగేజ్‌మెంట్‌ తర్వాత బ్రేకప్‌ చెప్తున్నాను. మేమిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పటివరకూ నన్ను సపోర్ట్‌ చేసిన మీరందరూ ఇకపైనా నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను. ఆలస్యం కాకుండా సరైన సమయంలోనే చేదు నిజాలను గ్రహించాను.  అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నేను అజీమ్‌ఖాన్‌ను ఇప్పటివరకూ కలవలేదు. కేవలం ఫోన్ల ద్వారా మాత్రమే మేమిద్దరం మాట్లాడుకున్నాం. వ్యక్తిగతంగా ఇది నాకెంతో కఠినమైన సమయం'' అని  పోస్ట్ చేశారు. 


అయితే సబా నిర్ణయాన్ని అజీమ్‌ గౌరవించడం విశేషం. 'సబా.. నువ్వు మంచి మనస్సున్న వ్యక్తివి. ఈ భూమ్మీద ఉన్న సంతోషమంతా నీకు దక్కాలని ఆశిస్తున్నాను. దేవుడు నీకు అన్నివేళలా విజయాన్నే అందించాలని కోరుకుంటున్నా. ముళ్లబాట చిట్టచివరికి అందమైన గమ్యస్థానానికి చేరుస్తుంది. అలాగే ఈ బ్రేకప్‌ పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 
నిశితార్థం తరువాత అజీమ్ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. సబా నిర్ణయం వెనుక కారణం కూడా ఇదేనంటూ ప్రచారం సాగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios