ఏమీ చేయలేం, అది నయనతార వ్యక్తిగత విషయం.. విశాల్ కామెంట్స్
ప్రస్తుతం విశాల్ నటిస్తున్న తాజా చిత్రం మార్క్ ఆంటోనీ. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఎస్ జె సూర్య నటిస్తున్నాడు.దీనితో ఆడియన్స్ లో వీరిద్దరి కాంబినేషన్ పై ఆసక్తి పెరిగిపోయింది.

విశాల్ తెలుగు తమిళ భాషల్లో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. విశాల్ ని తెలుగు ప్రేక్షకులు ఇక్కడి నటుడిగానే ప్రేమ కురిపిస్తారు. తెలుగు రాష్ట్రాలతో విశాల్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. విశాల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏపీలోనే మొదలయింది. సినిమాలతో పాటు ఇతర వ్యవహారాలు, వివాదాలతో కూడా నిత్యం విశాల్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం విశాల్ నటిస్తున్న తాజా చిత్రం మార్క్ ఆంటోనీ. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఎస్ జె సూర్య నటిస్తున్నాడు.దీనితో ఆడియన్స్ లో వీరిద్దరి కాంబినేషన్ పై ఆసక్తి పెరిగిపోయింది. ఆధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. స్టార్ మ్యూజిక్ కంపోజర్ జివి ప్రకాష్ బాణీలు అందిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి వినాయక చవితికి ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర మీడియా సమావేశంలో విశాల్ పాల్గొన్నారు. అయితే ఎక్కడికెళ్లినా నయనతార గురించి చర్చ మాత్రం ఆగడం లేదు. విశాల్ తన చిత్రం కోసం మీడియా సమావేశం నిర్వహిస్తే సంబంధం లేకుండా నయనతార గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
నటులంతా తమ చిత్రాలని ప్రమోట్ చేసేందుకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ నయన్ ఎందుకు సినిమా కార్యక్రమాలకి హాజరు కావడం లేదు అని విశాల్ ని ప్రశ్నించారు. విశాల్, నయనతార సెల్యూట్ అనే చిత్రంలో జంటగా నటించారు. నయనతార సినిమా ప్రమోషన్ లో ఖచ్చితంగా పాల్గొనాలని రూల్ లేదు. అది ఆమె వ్యక్తిగత విషయం.
తనకి ఇష్టం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలం అని విశాల్ అన్నారు. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం, పాల్గొనకపోవడం రెండూ తప్పు కాదు. కానీ నయనతార పాల్గొంటే బావుంటుంది అని విశాల్ అన్నారు. కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకునే నయన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం చాలా అరుదు. చాలా మంది నిర్మాతలు ఈ విషయంలో ఆల్రెడీ నయన్ పై కంప్లైంట్ చేశారు. కానీ నయన్ తన నిర్ణయం మార్చుకోలేదు.