కోలీవుడ్ స్టార్ హీరో.. తెలుగు కుర్రాడు విశాల్ (Vishal) మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. షూటింగ్ సమయంలో ఆయనకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఇలానే విశాల్ (Vishal) షూటింగ్ టైమ్ లో గాయపడ్డారు.
కోలీవుడ్ స్టార్ హీరో.. తెలుగు కుర్రాడు విశాల్ (Vishal) మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. షూటింగ్ సమయంలో ఆయనకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఇలానే విశాల్ (Vishal) షూటింగ్ టైమ్ లో గాయపడ్డారు.
తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) మరోసారి గాయాలపాలు అయ్యారు. లాఠి సినిమా షూటింగ్ సెట్ లో ప్రమాదం వల్ల ఆయనకు దెబ్బలు తగిలాయి. కోలీవుడ్ డైరెక్టర్ ఏ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న లాఠి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు విశాల్(Vishal). పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో సునయన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫూటింగ్ లోనే ఓ షాట్ లో ఆయన చేతికి తీవ్రంగా గాయం అయ్యింది.
ఈ విషయాన్ని స్వయంగా విశాలే(Vishal) ప్రకటించారు. తన సోషల్ మీడియా పేజ్ లో వీడియో అప్ లోడ్ చేశారు విశాల్. గాయం అయిన తీరును వివరిస్తూ..ట్వీట్ చేశారు. విశాల్ చేతి ఎముకలకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈసినిమాలో పోలీస్ ఆఫీసర్ గా విశాల్ (Vishal) కనిపించబోతున్నారు. ఓ బాలుడిని రక్షించే సీన్ న్ షైట్ చేస్తుండగా విశాల్ కు ప్రమాదం జరిగింది.
అంతేకాదు ట్రీట్ మెంట్ కోసం ఆయన కేరళ వెళ్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. అక్కడే 15రోజులుకు పైగా చికిత్సతో పాటు విశ్రాంతి కూడా తీసుకోబోతున్నట్టు తెలిపారు. అంతే కాదు మార్చ్ ఫస్ట్ వీక్ లో ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవుతాను అన్నారు విశాల్(Vishal).
గతంలో కూడా విశాల్ (Vishal) కు ఇలానే గాయాలు అయ్యాయి. షూటింగ్ లో డూప్స్ ను వాడకుండా విశాల్ తను సొంతంగానే స్టంట్స్ చేస్తారు. ప్రయోగాలు చేయడంతో విశాల్ ముందు ఉంటారు. ఇంతకు ముందు కూడా హైదరాబాద్ లో జరిగిన ఎనిమి షూటింగ్ లో కూడా విశాల్(Vishal) ఇలాగే గాయపడ్డారు. అంతకు ముందు కూడా నాట్ ఏ కామన్ మ్యాన్ మూవీ షూటింగ్ టైమ్ లో కూడా విశాల్ ఇలానే స్టంట్స్ చేసి గాయపడ్డారు.
