నటుడు నాగబాబు ముద్దుల తనయ, హీరో వరుణ్‌ తేజ్‌ బేబీ సిస్టర్‌ నిహారిక ఎంగేజ్‌మెంట్‌ వెంకట చైతన్యతో గురువారం పరిమిత అతిథులతో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనకు  కాబోయే బావకి హీరో వరుణ్‌ తేజ్‌ స్వాగతం పలికారు. `ఈ రోజు జరిగింది. నా బేబీ సిస్టర్‌ ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. ఫ్యామిలీలోకి స్వాగతం బావా` అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా నిహారిక, చైతన్యల ఎంగేజ్‌మెంట్‌ ఫోటోని పంచుకున్నారు. 

మరోవైపు నాగబాబు సైతం కాబోయే అల్లుడికి ఆత్మీయ స్వాగతం పలికారు. `డియర్‌ చై.. దాదాపు అన్ని విషయాల్లో తను అచ్చం నాలాగే ఉంటుందని అంతా అంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమనంతా నువ్వు తనపై కురిపిస్తావనని నమ్ముతున్నా` అంటూ చైతన్యకి స్వాగతం పలుకుతూ, ` ఈ రోజు నుంచి తను అధికారికంగా నీ సమస్యగా మారిపోయింది` అని సరదాగా ట్వీట్‌ చేశారు. మరోవైపు చైతన్య వైపు ఫ్యామిలీ మెంబర్స్ సైతం నిహారికని వారి కుటుంబంలోకి స్వాగతం పలికారు. 

గుంటూరుకి చెందిన పోలీస్‌ అధికారి కుమారుడు వెంకట చైతన్య. గురువారం జరిగిన ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమంలో చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన, అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ తోపాటు అతికొద్ది మంది బంధువులు పాల్గొన్నారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్రతంలో ఉండటం వల్ల రాలేకపోయినట్టు తెలుస్తుంది.