చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో గుర్తింపు సొంతం చేసుకున్న యువ నటుడు తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో గుర్తింపు సొంతం చేసుకున్న యువ నటుడు తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రయోగాల బాట పడుతూ పెద్ద సాహసాలే చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.
ప్రస్తుతం తేజ సజ్జా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హను మాన్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. హను మాన్ చిత్రం ఆంజనేయ స్వామి నేపథ్యంలో విజువల్ వండర్ గా తెరకెక్కుతోంది. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ హను మాన్ తో పెద్ద అద్భుతమే సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో తేజ సజ్జా సూపర్ హీరోగా నటిస్తున్నాడు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా తేజ సజ్జా చూస్తుండగానే టాలీవుడ్ లో 25 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్నాడు. తేజ సజ్జా వయసు 28 ఏళ్ళు. తక్కువ వయసులోనే ఇండస్ట్రీలో ఎక్కువ అనుభవం సాధించాడు ఈ కుర్ర హీరో. 1998లో తేజ సజ్జా మెగాస్టార్ చిరంజీవి 'చూడాలని ఉంది' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ విడుదలై నేటికి సరిగ్గా పాతికేళ్ళు గడుస్తోంది.
పాతికేళ్ల క్రితం సరిగ్గా ఈరోజు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. అప్పుడు నాకు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు అదే నా జీవితాన్ని మార్చేసింది. మెగాస్టార్ లాంటి లెజెండ్ నటించిన చిత్రంతో ఎంట్రీ ఇచ్చాను. చూస్తుంటే అంతా ఒక కలలా జరిగినట్లు ఉంది. చిరంజీవి గారికి, అశ్విని దత్ గారికి, గుణశేఖర్ గారికి నా కృతజ్ఞతలు అంటూ తేజ సజ్జా ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశాడు. తనని మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకుని ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేశాడు. తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా చూడాలని ఉంది, ఇంద్ర, యువరాజు లాంటి చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు.
