బ్రదర్స్, వీడొక్కడే లాంటి విజయవంతమైన చిత్రాల తర్వాత సూర్య, కెవి ఆనంద్ దర్శత్వంలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ బందోబస్త్. ఈ చిత్రంలో సూర్య సెక్యూరిటీ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. టెర్రరిస్ట్ అటాక్స్, సూర్య వాటిని చేధించే అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు ఉత్కంఠ భరితంగా తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఇదిలా ఉండగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో సూర్య తన ఫ్యాన్స్ కు చెప్పిన ఓ మాటకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇటీవల చెన్నై నగరంలో ఓ హోర్డింగ్ కూలడం వాళ్ళ శుభశ్రీ అనే యువతి మరణించింది. 

దీనితో తన ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ.. నా కోసం ఎలాంటి ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లు ఏర్పాటు చేయవద్దు. దీనితో సూర్య విజ్ఞప్తికి అభిమానుల నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతోంది. స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యే సందర్భంలో ఫ్యాన్స్ హోర్డింగులు, కటౌట్ల ఏర్పాటు చేసి సంబరాలు చేసుకుంటారు. అవి ప్రమాదానికి దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

బందోబస్త్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధం అవుతోంది. మోహన్ లాల్, బోమన్ ఇరానీ, ఆర్య ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.