తమిళంతో పాటు తెలుగులో కూడా అభిమానం సొంతం చేసుకున్న నటుడు సూర్య. గజినీగా, సింగంగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. సూర్య చివరగా నటించిన చిత్రం ఈటి.

తమిళంతో పాటు తెలుగులో కూడా అభిమానం సొంతం చేసుకున్న నటుడు సూర్య. గజినీగా, సింగంగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. సూర్య చివరగా నటించిన చిత్రం ఈటి. మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీనితో సూర్య తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. 

ప్రస్తుతం సూర్య.. క్రేజీ డైరెక్టర్ బాల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన శివపుత్రుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రం జాతీయ అవార్డు కూడా దక్కించుకుంది. తిరిగి వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం వస్తునడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. 

ప్రస్తుతం నటిస్తున్న మూవీలో సూర్య మత్స్యకారుడు పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జాలర్లు నివసించేలా ప్రాతాల్లో షూటింగ్ చేయనున్నారు. దీని కోసం జాలర్లు నివసించేలా సహజంగా ఉండే ఇళ్ళని, గుడిసెలని నిర్మిస్తున్నారట. భారీ ఖర్చుతో నాణ్యమైన సెట్స్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

షూటింగ్ పూర్తయ్యాక సెట్ ని నాశనం చేయకుండా ఆ ఇళ్ళని.. నిరుపేదలైన ఇవ్వాలని సూర్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనితో సూర్య గొప్ప మనసుని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో సూర్య గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.