Asianet News TeluguAsianet News Telugu

సురారై పోట్రు మూవీతో  వరల్డ్ రికార్డు కొట్టిన హీరో సూర్య!

సురారై పోట్రు అరుదైన వరల్డ్ రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ప్రముఖ సినిమా రేటింగ్ సంస్థ ఐ ఎమ్ బి డి సురారై పోట్రు సినిమాకు 9.1 రేటింగ్ ఇవ్వడం జరిగింది. 

hero suriya grabs a world record with soorari pottru ksr
Author
Hyderabad, First Published May 14, 2021, 11:11 AM IST

చాలా కాలం తరువాత సురారై పోట్రు మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు హీరో సూర్య. లేడీ డైరెక్టర్ సుధా కొంగర నిర్మించిన ఈచిత్రం ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో విడుదల చేయగా, ఇక్కడ సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. సూర్య కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్సుతో ఆకట్టుకోగా, సుధా కొంగర టేకింగ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. 


కాగా సురారై పోట్రు అరుదైన వరల్డ్ రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ప్రముఖ సినిమా రేటింగ్ సంస్థ ఐ ఎమ్ బి డి సురారై పోట్రు సినిమాకు 9.1 రేటింగ్ ఇవ్వడం జరిగింది. దీనితో ప్రపంచంలోనే అత్యధిక ఐ ఎమ్ బి డి రేటింగ్ అందుకున్న చిత్రాల జాబితాలో సురారై పోట్రు మూడవ స్థానంలో నిలిచింది. 1994 వచ్చిన ది శశాంక్ రిడంప్షన్ 9.3 రేటింగ్ తో మొదటిస్థానంలో ఉండగా, 1972లో విడుదలైన గాడ్ ఫాదర్ 9.2 రేటింగ్ తో రెండవ స్థానంలో నిలిచింది. ఈ రెండు చిత్రాల తరువాత సురారై పోట్రు మూడవ స్థానం దక్కించుకోవడం విశేషం.

 
డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జి ఆర్ గోపీనాధ్ జీవితకథ ఆధారంగా సురారై పోట్రు మూవీ తెరకెక్కింది. అత్యంత తక్కువ ధరకు విమాన ప్రయాణానికి నాంది పలికిన సామాన్యుడుగా సూర్య అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. సురారై పోట్రు మూవీలో విలక్షణ నటుడు మోహన్ బాబు ఓ కీలక రోల్ చేయడం విశేషం. లాక్ డౌన్ నేపథ్యంలో సురారై పోట్రు చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది. 
  

Follow Us:
Download App:
  • android
  • ios