Asianet News TeluguAsianet News Telugu

నా సినిమా నాకే నచ్చలేదు.. సందీప్ కిషన్ షాకింగ్ కామెంట్స్..

తన సినిమా తనకే నచ్చలేదన్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. అంతే కాదు ఆ సినిమా ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసు అని చెప్పి షాక్ ఇచ్చాడు. 
 

Hero Sundeep Kishan Shocking Comments about Her Flop Movie JMS
Author
First Published Feb 9, 2024, 11:35 AM IST | Last Updated Feb 9, 2024, 11:37 AM IST

హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదరుచూస్తున్నాడు సందీప్ కిషన్. ఎంత ప్రయత్నించినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా.. లాభం లేకుండా పోతోంది. హిట్ కోసం ప్రయత్నాలు చేసే క్రమంలోనే సందీప్ కిషన్  గతేడాది చేసిన సినిమా  మైఖేల్. ఈసినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి చాలా కష్టపడ్డాడు సందీప్ కిషన్. కాని ఈమూవీ భారీ డిజాస్టర్గా నిలిచిపోయింది. ఇక ఈసినిమా విషయంలో తాజాగా స్పందించాడు సందీప్. సందీప్ కిషన్ కామెంట్స్ తో అంతా షాక్ అయ్యారు. 

సందీప్ కిషన్ తాజాగా నటించిన సినిమా భైరవ కోన. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు ముస్తాబవుతుంది. ఈమూవీ ప్రమోషన్ లో భాగంగా..మూవీ టీమ్ తో కలిసి గట్టిగా తిరిగేస్తున్నాడు సందీప్ కిషన్.  వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ అండ్ టీం ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు యంగ్ హీరో... గత ఏడాది తాను ఎంతో కష్టపడి  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా డిజాస్టర్ అవ్వడంపై ప్రశ్న ఎదురవ్వగా డిఫరెంట్ గా స్పందించాడు సందీప్‌ కిషన్‌.

సందీప్ కిషన్ మాట్లాడుతూ.." నిజమే 'మైఖేల్' సినిమా థియేటర్స్ లో సరిగా ఆడలేదు. మూవీ రెవెన్యూ గురించి పక్కన పెడితే సినిమా ఫైనల్ అవుట్ పుట్ నాకే నచ్చలేదు. అదే విషయాన్ని డైరెక్టర్ కి కూడా చెప్పా. మా దగ్గర సాలిడ్ ఫుటేజ్ ఉంది. సో ఎడిటింగ్ విషయంలో ఏదైనా మ్యాజిక్ జరిగి ఉంటే మైఖేల్ ఫెంటాస్టిక్ ఫిలిం అయ్యేది. అక్కడే తేడా వచ్చింది. అందుకే ఆమూవీ అలా అయ్యింది అని అన్నారు సందీప్. ప్రస్తుతం హిట్ కోసం ఎదరు చూస్తున్న యంగ్ హీరో.. ఈసారి భైరవ కోన సినిమాతోసాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios