Asianet News TeluguAsianet News Telugu

సీఎం రేవంత్ రెడ్డిపై సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు.. చేతిలో కండోమ్ పట్టుకుని యాడ్ చేశా

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు 2 జూలై 12న రిలీజ్ కి రెడీ అవుతోంది.  దీనితో  శంకర్, కమల్ హాసన్, ఇండియన్ 2 చిత్ర యూనిట్ ఇండియా మొత్తం తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు.

Hero Siddharth sensational comments on CM Revanth Reddy dtr
Author
First Published Jul 8, 2024, 5:46 PM IST | Last Updated Jul 8, 2024, 5:46 PM IST

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు 2 జూలై 12న రిలీజ్ కి రెడీ అవుతోంది.  దీనితో  శంకర్, కమల్ హాసన్, ఇండియన్ 2 చిత్ర యూనిట్ ఇండియా మొత్తం తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. నేడు హైదరాబాద్ లో భారతీయుడు 2 చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

మీడియా ప్రతినిధులు ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యల గురించి కమల్ హాసన్, సిద్దార్థ్ లని ప్రశ్నించారు. టికెట్ ధరలు పెంచుకోవాలంటే ప్రతి నటుడు డ్రగ్స్ కి వ్యతిరేకంగా 2 నిమిషాల వీడియో చేసి పంపాలని అలాంటి వాళ్ళ సినిమాకి మాత్రమే టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తాం అని అన్నారు. 

దీనిపై సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించాను. మొట్ట మొదట హైదరాబాద్ లో కండోమ్ వాడమని చేతులో కండోమ్ పెట్టుకుని హోర్డింగ్స్ కి ఫోజు ఇచ్చిన నటుడిని నేను. ఒక నటుడిగా ఆ భాద్యత నాకు ఉంది. అవసరం అయినప్పుడు మేము మా బాధ్యత చాటుకుంటాం. 

కానీ ఇది చేస్తేనే మీకు ఇది దక్కుతుంది అని సీఎం మాట్లాడడం కరెక్ట్ కాదు అని సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలకి చేశారు. సిద్దార్థ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios