టాలీవుడ్ ఓ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న హీరో శర్వానంద్ వరుస చిత్రాలతో రాణిస్తున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా శర్వానంద్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా శర్వానంద్ చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

టాలీవుడ్ ఓ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న హీరో శర్వానంద్ వరుస చిత్రాలతో రాణిస్తున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా శర్వానంద్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా శర్వానంద్ చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అదే సమయంలో శర్వా యువత మెచ్చే లవ్ స్టోరీస్ కూడా చేస్తుంటాడు. 

గత ఏడాది శర్వానంద్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రక్షిత రెడ్డి అనే యువతితో శర్వానంద్ వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవిస్తున్నారు. శర్వానంద్ లేటుగా అయినా ఫ్యాన్స్ ని థ్రిల్ చేసే గుడ్ న్యూస్ చెప్పాడు. శర్వానంద్, రక్షిత దంపతులు తల్లిదండ్రులయ్యారు. శర్వానంద్ సతీమణి రక్షిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 

View post on Instagram

అయితే ఈ గుడ్ న్యూస్ ని శర్వానంద్ ఆలస్యంగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. వీరికి పాప పుట్టి కొన్ని రోజులు గడుస్తోంది. నేడు శర్వానంద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా శర్వా తన ముద్దుల కూతురితో భార్యతో కలసి ఉన్న ఫొటోస్ షేర్ చేశాడు. 

View post on Instagram

అంతే కాదు తన కుమార్తె పేరు కూడా రివీల్ చేశాడు. శర్వానంద్ తన కూతురికి లీలా దేవి అని నామకరణం చేశాడు. అమ్మవారి పేరు కావడంతో నెటిజన్లు అంతా ప్రశంసిస్తున్నారు. తన పుట్టినరోజు సంతోష సమయంలో కూతురితో కలసి తాము కొత్త జర్నీ ప్రారంభిస్తున్నట్లు శర్వా పేర్కొన్నాడు. అయితే శర్వానంద్ కుమార్తె ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఈ క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శర్వా, రక్షిత దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేస్తున్నారు. 

View post on Instagram